Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న ఓ మాట.. ‘రాజమౌళితో సినిమా చేశాక ఆ హీరో నెక్స్ట్‌ ఏ సినిమా చేసినా విజయం దక్కడం కష్టం.. ఆ మాటకొస్తే అసాధ్యం’. ఆ మాటకు తగ్గట్టే ఆయన సినిమా తర్వాత ఆ హీరో ఎవరైనా, ఏ సినిమా చేసినా ఫ్లాప్‌లు అయితే అందుకున్నాడు. దీంతో పై మాటను ఓ శాపంలా మాట్లాడుకుంటారు అంతా. తాజాగా ఈ మాటపై యువ హీరో నిఖిల్‌ సిద్ధార్థ ఓ ఇంటర్వ్యూలో రియాక్ట్‌ అయ్యాడు. అలా ఎందుకు అనుకుంటున్నారు, అసలేమవుతోంది అనే వివరాలు కూడా చెప్పాడు..

Nikhil

రాజమౌళితో బ్లాక్‌బస్టర్లు, ఇండస్ట్రీ హిట్‌లు ఇచ్చిన హీరోలు ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఆ నెక్స్ట్‌ చేసిన సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. మిగిలిన హీరోల పరిస్థితీ దాదాపు ఇంతే. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నిఖిల్‌ని హోస్ట్‌ అడిగారు. రాజమౌళి – నిఖిల్‌కి ఎక్కడా సంబంధం లేదు. కలసి పని చేసింది కూడా లేదు. కానీ ఎందుకు అడిగారు అనేది వేరే విషయం. అయతే ఆ శాపం ప్రశ్నకు నిఖిల్‌ రియాక్ట్‌ అవుతూ ఇది పూర్తి కోఇన్సిడెన్స్‌ అని క్లారిటీ ఇచ్చేశాడు.

నేను ఈ విషయం గురించి మాట్లాడొచ్చో లేదో తెలియదు. అయితే రాజమౌళి సినిమాల తర్వాత హీరోల సినిమా ఫ్లాప్‌ అవ్వడం అనేది యాదృచ్ఛికం మాత్రమే. శాపాలు, మూఢ విశ్వాసాలు లాంటివాటిపై నాకు నమ్మకం లేదు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ భారీ చిత్రాలు. తెలుగు సినిమా, భారతీయ సినిమా ఘనతను ప్రపంచానికి చాటి చెప్పాయి. ఈ క్రమంలో హీరోలను మరో ఎత్తులో కూర్చోబెట్టాయి. ఆ స్థాయిలో హీరోను చూసిన తర్వాత దాని కన్నా ఏమాత్రం తక్కువ ఉన్నా ప్రేక్షకుడు జీర్ణించుకోలేడు. ఇక్కడ అదే జరిగింది.

ప్రభాస్‌ రీసెంట్‌గా ‘కల్కి 2898 ఏడీ’ రూ.1000 కోట్ల పైనే వసూలు చేసింది. తారక్‌ ‘దేవర’ సినిమా సూపర్‌ హిట్. రామ్‌ చరణ్‌ ‘పెద్ది’ త్వరలో వస్తోంది. ఇలా అందరూ పెద్ద సినిమాలే చేస్తున్నారు అని చెప్పుకొచ్చాడు నిఖిల్‌.

మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus