Chaari 111 First Review: వెన్నెల కిషోర్ హీరోగా సక్సెస్ అయ్యాడా..లేదా?

  • February 29, 2024 / 07:42 PM IST

టాలీవుడ్ స్టార్ కమెడియన్ ‘వెన్నెల’ కిశోర్ హీరోగా మారుతూ చేసిన చిత్రం ‘చారి 111’. ‘మళ్ళీ మొదలైంది’ ఫేమ్ టీజీ కీర్తి కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘బర్కత్ స్టూడియోస్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని అదితి సోనీ నిర్మించారు. సంయుక్తా విశ్వనాథన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. సీనియర్ నటుడు మురళీ శర్మ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. మార్చి 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ నే రాబట్టుకున్నాయి. వెన్నెల కిషోర్ ఈ చిత్రంతో హీరోగా మారుతున్నప్పటికీ.. తన మార్క్ కామెడీని మాత్రం మిస్ చెయ్యట్లేదు అని ప్రమోషనల్ కంటెంట్ తో క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ‘చారి 111 ‘ మేకర్స్ ఇండస్ట్రీలోని పెద్దలకి ఆల్రెడీ ఓ స్పెషల్ షో వేయడం జరిగింది. వారి టాక్ ప్రకారం.. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని, ఓ పక్క స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా సాగుతూనే మరోపక్క కామెడీ కూడా ఆకట్టుకుంటుందని..

రెండింటినీ దర్శకుడు బాగా హ్యాండిల్ చేశాడని తెలుస్తుంది. ఇంటర్వెల్ వద్ద వచ్చే ట్విస్ట్ సర్ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. సెకండ్ హాఫ్ లో ఫన్ ఎక్కువగానే ఉంటుందట. పెద్దగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే సన్నివేశాలు లేకపోయినా.. తప్పకుండా ఓసారి అందరూ తప్పకుండా చూసి ఎంజాయ్ చేసే విధంగా (Chaari 111) ‘చారి 111 ‘ ఉంటుందని అంటున్నారు.

వెన్నెల కిషోర్ కి ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చి కథని సైడ్ ట్రాక్ పెట్టించకపోవడం సినిమాకి ప్లస్ అయ్యిందని, మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుందని అంటున్నారు.సినిమా అయితే ఒకసారి చూసి ఎంజాయ్ చేసే విధంగానే ఉందట. అయితే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇస్తుందనేది చూడాలి.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus