Chandini Chowdary: దర్శకుడికి చాందిని స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్!

  • June 22, 2021 / 10:46 AM IST

అప్పటివరకు పలు షార్ట్ ఫిలిమ్స్ ను తెరకెక్కించిన సందీప్ రాజ్ ‘కలర్ ఫోటో’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమాతో చాలా మందికి మంచి పేరొచ్చింది. హీరోగా సుహాస్ కి తొలి సినిమా అయినా బాగా నటించాడు. హీరోయిన్ చాందిని చౌదరికి ఈ సినిమాతో మంచి హిట్ వచ్చింది. అలా ఈ సినిమా చాలా మందికి లైఫ్ ఇచ్చింది. ఓటీటీలో రిలీజైన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాను ప్రశంసిస్తూ పోస్ట్ లు పెట్టారు.

ఈ సినిమాతో అందరికంటే చాందిని చౌదరికి మంచి గుర్తింపు వచ్చిందని చెప్పాలి. ఈ సినిమాలో అందంగా కనిపించడంతో పాటు బాగా పెర్ఫార్మ్ చేసింది. అలాంటి మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడికి చాందిని చాలా సార్లు థాంక్స్ చెప్పారు. తాజాగా సందీప్ రాజ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడిపై ఉన్న ప్రేమను బయటపెట్టింది చాందిని. ఎంతో ప్రియమైన సందీప్ రాజ్ కు హ్యాపీ బర్త్ డే అని చెప్పిన చాందిని..

‘కలర్ ఫోటో’ సినిమాకు వెనుకున్న బలం ఈయనే అని చెప్పింది. ‘నువ్ నా జీవితంలోకి వచ్చినందుకు నేనెంతో లక్కీ.. ఇంకా నీ స్టోరీలు చూడాలని ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాను. నువ్వొక తుఫాను’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం సందీప్ రాజ్ తన తదుపరి సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అలానే చాందిని చేతిలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి.


Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus