Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

‘కార్తికేయ’ సినిమాతో హిట్‌ డైరక్టర్‌ హోదా అందుకున్న దర్శకుడు చందు మొండేటి.. ఆ తర్వాత ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్‌ ఇండియా లెవల్‌లో పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘తండేల్‌’ సినిమాతో మంచి విజయమే అందుకున్నారు. అయితే ఆ సినిమా వచ్చి ఏడాది దాటిపోయినా ఇంకా ఏ సినిమా కూడా మొదలుపెట్టలేదు. ఆ మధ్య ‘వాయుపుత్ర’ అనే ఓ యానిమేటడ్‌ సినిమాను అనౌన్స్‌ చేశారు. ఆ తర్వాత దాని గురించి ఎక్కడా ఎలాంటి సమాచారం లేదు.

Chandu Mondeti

ఇలాంటి సమయంలో ఓ పాన్‌ ఇండియా వార్త ఒకటి బయటకు వచ్చింది. అదే ‘మహా కాల్‌’. ఈ పేరు వినగానే సంజయ్‌ లీలా భన్సాలీ గుర్తొస్తారు. ఎందుకంటే ఆయన ఈ కథ పట్టుకుని చాలా ఏళ్లుగా ఓ సినిమా కోసం ప్లాన్‌ చేస్తున్నారు. తన కథతో, తన నిర్మాణంలో ఓ సినిమా చేయాలని చాలా ఏళ్లుగా ప్లాన్స్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది నటులతో మాట్లాడినా ఎందుకో కానీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు దర్శకుడిగా చందు మొండేటిని ఫిక్స్‌ అయ్యారని తెలుస్తోంది.

‘కార్తికేయ 2’ సినిమా చూశాక.. ‘మహాకాల్‌’ సినిమాకు ఆయనైతేనే బాగుంటుందని భన్సాలీ అనుకున్నారట. దీంతో సందీప్ రెడ్డి వంగ, గౌతమ్ తిన్ననూరి, శైలేష్ కొలను తర్వాత చందుకే బాలీవుడ్‌ అవకాశం దక్కుతోంది. ఇంకొంతమంది దర్శకులు ఈ ప్రయత్నాల్లో ఉన్నారు అనుకోండి. ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటి కలయికలో ‘మహాకాల్’ సినిమా ఉండబోతోంది అని చెబుతున్నారు. త్వరలోనే అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని అంటున్నారు.

ఓవైపు అక్షయ్‌కి, మరోవైపు రానాకి ఇప్పుడు అర్జెంట్‌గా హిట్‌ కావాలి. భన్సాలీ కూడా ఈ సినిమా కోసం చాలా ఏళ్లుగా ఆలోచిస్తున్నారు. ఇక చందుకి ఈ సినిమా ఫస్ట్ బాలీవుడ్‌. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫలితం కీలకంగా మారింది. సరైన కథ పడక బాలీవుడ్‌లో సరైన విజయాలు రావడం లేదు. ఈ సమయంలో భన్సాలీ కథ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. ఇక్కడో మాట ఆయన కథ ఎప్పుడూ ఫెయిల్‌ అవ్వలేదు.

 మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus