Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

టాలీవుడ్‌లో ఇప్పుడు ‘తొక్కడు’బిల్ల ఆట నడుస్తోంది. ఓవైపు నెటిజన్లు కొంతమంది ప్రముఖ నటుడు చిరంజీవిని ‘తొక్కుడు స్టార్‌’ అని బిరుదు ఇచ్చి అవమానకరంగా మాట్లాడుతుంటే.. మరోవైపు ఇంకొంతమంది నెటిజన్లు ఆయన ఇలాంటి విమర్శలను తొక్కేసి ఎవరూ అందుకోనంత ఎత్తుకు ఎదుగుతున్నారు అని సపోర్టు చేస్తున్నారు. ఇలా ఎవరి వాదనలు వారివి జరుగుతుంటే.. తాజాగా ప్రముఖ నటుడు, చిరంజీవికి అత్యంత సన్నిహితుడు (?) మోహన్‌బాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ‘తొక్కుడు’ వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

Mohan Babu

నాని, మోహన్‌బాబు, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఇటీవల వచ్చిన ‘ది ప్యారడైజ్‌’ సినిమా ప్రచార వీడియోలే ఇప్పుడు ఈ చర్చకు కారణంగా మారాఇంది. పరిశ్రమలో ఒకరిని ఒకరు అణగదొక్కాలని చూసే సంస్కృతిపై మోహన్‌బాబు ఘాటుగా స్పందించారు. పరిశ్రమలో మనతో మంచిగా మాట్లాడుతూనే తొక్కుదామనుకునే వాళ్లు చివరికి వాళ్లే తొక్కించబడతారు అని మోహన్‌బాబు మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వీడియోలో మోహన్‌బాబు ఎవరి పేరూ ప్రస్తావించలేదు.

అయితే ‘తొక్కేయడం’ అనే అర్థం వచ్చేలా మోహన్‌బాబు మాట్లాడటంతోనే ఈ చర్చ జరుగుతోంది. మరోవైపు గతంఓల చిరంజీవిపై మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన చిరంజీవి గురించే అన్నారు అంటూ కొత్త భాష్యాలు పుట్టిస్తున్నారు. అలాగే ఇటీవల ‘ది ప్యారడైజ్’ సినిమా పోస్ట్‌ రిలీజ్‌ ఈవెంట్లో మోహన్‌బాబు మాట్లాడుతూ… కొంతమందికి కేవలం డ్యాన్సులు తప్ప నటన రాదని అన్నారు. అప్పుడు కూడా ఎవరి పేరూ చెప్పకపోయినా అది చిరంజీవి గురించే అనే పోలికలు మొదలెట్టారు నెటిజన్లు.

ఇక ‘బాస్ తొక్కేశాడు’ అనే నెగెటివ్ ప్రచారంపై చిరంజీవి ఇటీవల ‘సిగ్మా’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లాతో సరదాగా మాట్లాడుతూ.. నన్ను అవాయిడ్ చేశావా? నన్నేమైనా తొక్కేయాలని చూస్తున్నావా అంటూ నవ్వేశారు. అది తనపై వచ్చే ట్రోలింగ్‌కి కౌంటర్‌ అని అంటున్నారు. ఇప్పుడు మోహన్‌బాబు అన్యాపదేశ కామెంట్లతో టాలీవుడ్‌లో మరోసారి మంచు వర్సెస్‌ మెగా అనే చర్చ మొదలవుతుందా అనే ప్రశ్న వినిపిస్తోంది.

రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus