మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇది పూర్తయిన వెంటనే ‘లూసిఫర్’ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ఎన్వీ ప్రసాద్ మరియు రాంచరణ్ లు కలిసి నిర్మించబోతున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. క్యాస్టింగ్ ఎంపిక ప్రక్రియ ముమ్మరం చేసారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ గా నయనతారని ఫిక్స్ చేసారని తెలుస్తుంది.
మొన్నటి వరకు ఈమె చిరుకి చెల్లెలు పాత్రలో కనిపించబోతుందంటూ ప్రచారం జరిగింది.కానీ అందులో నిజం లేదని తాజా సమాచారం. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో నయన్ పాత్ర ఉంటుందట. నిజానికి ఒరిజినల్ లో మోహన్ లాల్ సరసన హీరోయిన్ ఉండదు.అది పూర్తిగా మలయాళం నేటివిటీకి తగ్గట్టు ఉంటుంది కాబట్టి అందులో హీరోయిన్ అవసరం లేదు. కాకపోతే తెలుగు నేటివిటీకి తగ్గట్టు చిరు సరసన హీరోయిన్ పాత్ర కావాలి.
అయితే నిడివి ఎంత ఉంటుందనేది అర్థం కాని ప్రశ్న. దీని పై చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే ఒరిజినల్ లో హీరో చాలా లేట్ గా ఎంట్రీ ఇస్తాడు. చెప్పాలంటే 20 నిమిషాల వరకు హీరో పాత్ర కనబడదు. అయితే తెలుగులోకి వచ్చే సరికి ఆ ఎపిసోడ్ ను 5 నిమిషాలకు కుదించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా పెట్టబోతున్నట్లు సమాచారం.
Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్