ఒరిజినల్ లో వంటలక్క… కానీ ఇక్కడ వాళ్ళ అత్తట..!

  • February 7, 2021 / 02:15 PM IST

టెలివిజన్ రంగంలో చరిత్ర సృష్టిస్తున్న కార్తీక దీపం సీరియల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఈ సీరియల్ సాయంత్రం 7:30 అయ్యేసరికి దాదాపు ప్రతీ ఇంట్లో…ఇదే సీరియల్ ను చూస్తుంటారు.ఇక సోషల్ మీడియాలో ఎక్కువగా మీమ్స్ కూడా దీని పై ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఒకానొక టైంలో ఇండియన్ సీరియల్స్ లో హైయెస్ట్ టి.ఆర్.పి ని సాధించిన సీరియల్ గా చరిత్ర సృష్టించింది. సరే ఇక ఇప్పుడు ఈ సీరియల్ క్లైమాక్స్ కు వచ్చిందని ఇన్సైడ్ టాక్.

ఈమధ్యనే డాక్టర్ బాబు లవర్ హిమ ను మౌనిత చంపేసినట్టు తెలుసుకుంది వంటలక్క. దీంతో మౌనిత పై కోపంగా.. తన కుట్రను బట్ట బయలు చెయ్యాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో మరో 250 ఎపిసోడ్స్ తర్వాత కార్తీక దీపం ముగుస్తుందని తెలుస్తుంది. ఇది మలయాళం సీరియల్ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ హీరోయిన్ రోల్ చనిపోతుంది. కానీ ఇక్కడ క్లైమాక్స్ ను మార్చబోతున్నటు తెలుస్తోంది. మ్యాటర్ లోకి వెళితే ..

క్లైమాక్స్ లో కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు మరియు వంటలక్క కలిసిపోతారు. మౌనిత కుట్ర కూడా డాక్టర్ బాబుకి తెలిసిపోయి అసహ్యించుకుంటూ ఉంటాడు. దీంతో మౌనిత డాక్టర్ బాబు, వంటలక్క లను చంపేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో వంటలక్క అత్తగారు ..చనిపోతుంది. ఇదే క్లైమాక్స్ అని టాక్ మరి.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus