తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలుగా వెలుగొందుతున్న చాలా మందికి స్ఫూర్తి అంటే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అని చాలామంది చెబుతారు. అయితే హీరోలు మాత్రమే కాదు దర్శకులు కూడా చిరంజీవిని (Chiranjeevi) స్ఫూర్తిగా తీసుకొని వచ్చారు అని ఆ మధ్య ఓ సినిమా ప్రచారంలో భాగంగా తెలిసొచ్చింది. అయితే ఆ స్ఫూర్తి నేటి తరం దర్శకులకే కాదు.. 25 ఏళ్ల క్రితం సినిమాల్లోకి వచ్చినవాళ్లకు కూడా ఆయన స్ఫూర్తిగా నిలిచారు. ఈ విషయాన్ని మొన్నామధ్య ఆ దర్శకుడే చెప్పగా.. అప్పుడేం జరిగింది అనేది ఇప్పుడు చిరంజీవి చెప్పుకొచ్చారు.
ధనుష్ (Dhanush) – నాగార్జున (Nagarjuna) – రష్మిక మందన ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సక్సెస్ మీట్‌కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హాజరయ్యారు. ఈ క్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల ఇండస్ట్రీకి రావడం వెనుక బ్యాక్ స్టోరీని చిరంజీవి చెప్పుకొచ్చారు. 36 ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటనను చిరంజీవి ఇప్పుడు ప్రస్తావించారు. 1988లో హైదరాబాద్ రోడ్ల మీద ‘స్టేట్ రౌడీ’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు స్పాట్‌లో వేలాదిగా అభిమానులు వచ్చారట.
ఒక్కోసారి వాళ్లను కంట్రోల్ చేయలేకపోయేవారట. అలాంటి రోజుల్లో ఆ గుంపులో ఉన్న శేఖర్ కమ్ముల(Sekhar Kammula) ని చూసిన చిరంజీవి (Chiranjeevi) దగ్గరికు రమ్మని పిలిచారట. ఆనందంతో ఉబ్బితబ్బిబు అయిపోయిన శేఖర్ వచ్చి కాసేపు మాట్లాడారట. దాంతో కెరీర్‌లో ఏం చేయాలి అనే క్లారిటీ శేఖర్ కమ్ముల(Sekhar Kammula) కు వచ్చిందట. తన ముఖంలో ఆతృత చూసి చిరంజీవి పిలిచారు అని శేఖర్ కమ్ముల అనుకున్నారేమో.. తాను మాత్రం కుర్రాడు హైట్‌గా ఉండటంతో బాగా కళ్లకు ఆని పిలిపించా అని చిరంజీవి నవ్వుతూ చెప్పారు.
ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఏళ్లు అయిన సందర్భంగా ఈ మధ్య చిరంజీవి ఆశీస్సులు తీసుకోవడానికి శేఖర్ కమ్ముల వెళ్లారు. ఆ తర్వాత ‘‘టీనేజీలో ఉన్నప్పుడు చిరంజీవిని ఒకసారి దగ్గరగా చూశాను. ఆయనతో సినిమా తీయాలి అనే ఫీలింగ్ ఉంది. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా సంబరంలా జరుపుకుందాం అని టీమ్ అంది. దాంతో వెంటనే చిరంజీవి గుర్తొచ్చి ఆయన్ను కలిశాను. కొన్ని తరాలకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి ఆయన. కలలను సాధించు, విజయం సాధించు అని ఆయన చెబుతుంటారు. అందుకే నా సిల్వర్ జూబ్లీ ఆయన సమక్షంలో చేయాలని అనుకున్నను. చేశాను’’ అని తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు శేఖర్ కమ్ముల (Sekhar Kammula).
1988 స్టేట్ రౌడీ సినిమా షూటింగ్ అప్పుడు శేఖర్ కమ్ముల నన్ను మొదటిసారి కలిశాడు
నేనేదో పొడుగ్గా కనిపించాడు కదా అని పిలిచాను#Kuberaa #SekharKammula #Dhanush #NagarjunaAkkineni #RashmikaMandanna #Chiranjeevi #DeviSriPrasad pic.twitter.com/PQ4Ro5PJEI
— Filmy Focus (@FilmyFocus) June 22, 2025