‘లవ్ స్టోరీ’ (Love Story) తర్వాత శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కుబేర’ (Kuberaa) . ధనుష్ (Dhanush) హీరోగా నటించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున (Nagarjuna) అత్యంత కీలకమైన పాత్ర పోషించారు. ‘ఏషియన్ సినిమాస్’ ‘అమిగోస్ క్రియేషన్స్’ సంస్థలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్, శేఖర్ కమ్ముల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, పాటలు, ట్రైలర్ వంటివి సినిమాపై అంచనాలు పెంచాయి.ఈ మధ్య పెద్ద సినిమాలు కూడా లేకపోవడం వల్ల ‘కుబేర’ కి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 12 cr |
సీడెడ్ | 4 cr |
ఉత్తరాంధ్ర | 4 cr |
ఈస్ట్ | 2.2 cr |
వెస్ట్ | 2.0cr |
గుంటూరు | 2.0 cr |
కృష్ణా | 2.05 cr |
నెల్లూరు | 1.2 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 29.9 cr (షేర్) |
తమిళనాడు | 15 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 6 cr |
ఓవర్సీస్ | 8 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 58.9 (షేర్) |
‘కుబేర’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.58.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.60 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి. కానీ తమిళంలో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.