మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా క్రేజీ ఆఫర్లతో బిజీగా ఉండగా చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న కళ్యాణ్ కృష్ణ చిరంజీవి సినిమాతో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుని స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరతానని భావించారు. మొదట చిరంజీవి కూతురు సుస్మిత ఈ సినిమాను నిర్మిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా చేతులు మారుతుందని గతంలో వైరల్ అయిన వార్తలే నిజమవుతున్నాయని తెలుస్తోంది.
పీపుల్స్ మీడియా బ్యానర్ పై అనధికారికంగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. అయితే పీపుల్స్ మీడియా బ్యానర్ ఈ ప్రాజెక్ట్ ను టేకోవర్ చేయడం వల్ల సుస్మితకు కోట్ల రూపాయల లాభం వచ్చిందని సమాచారం అందుతోంది. నిర్మాతగా చిరంజీవి కూతురు లక్కీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే సుస్మిత నిర్మాతగా సక్సెస్ అయ్యారనే వార్త మెగా అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.
భోళా శంకర్ రిలీజ్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని భోగట్టా. పీపుల్స్ మీడియా పేరు తెరవెనుక ఉంటుందని నిర్మాతగా కూడా సుస్మిత పేరు కనిపిస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా లాభాల్లో కొంత మొత్తం సుస్మితకు లభించనుంది. చిరంజీవి సైతం ఈ విధంగా చేయడం ద్వారా సుస్మితకు (Sushmita) మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది.
చిరంజీవి పుట్టినరోజున అధికారికంగా చిరంజీవి కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయని సమాచారం అందుతోంది. శ్రీలీల, త్రిష ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా ఈ సినిమాలో నటించే మరో యంగ్ హీరోకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. చిరంజీవి రెమ్యునరేషన్ ప్రస్తుతం 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. సినిమా సినిమాకు చిరంజీవికి ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతోంది.
హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!
అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్