Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

చాలా నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న సాయి ధరమ్‌ తేజ్‌ సినిమా ‘సంబరాల యేటి గట్టు’ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12కి తీసుకొస్తాం అని ప్రకటించేశారు. ఆ రోజుకు సినిమా వస్తుందా? మళ్లీ ఎప్పటిలానే వాయిదా వేస్తారా? అనేది తెలియదు కానీ.. సాయితేజ్‌ రావడం వల్ల మేనమామ చిరంజీవి ఆగుతారు అని వచ్చిన రూమర్‌ మాత్రం నిజం కాదు అని అంటున్నారు. ఈ విషయంలో ఈ నెల 22న తేలిపోతుంది అని కూడా చెబుతున్నారు.

Mega 158 – SYG

ప్రముఖ కథానాయకుడు చిరంజీవి, యువ దర్శకుడు కొల్లి రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను సంక్రాంతికి తీసుకొస్తాం అని సినిమా అనౌన్స్‌మెంట్‌ సమయంలోనే చెప్పకనే చెప్పేశారు. అయితే సినిమా షూటింగ్‌ ప్రారంభం అవ్వడంలో ఆలస్యం వల్ల అనుకున్న సమయానికి సినిమా రాకపోవచ్చు అని అనుకున్నారు. కానీ సినిమా సంక్రాంతి సందర్భంగానే ప్రేక్షకుల ముందుకు రానుందని సినిమా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటివరకు జరిగిన 40 రోజులపాటు సాగిన షూటింగ్‌తో సినిమా తొలి సగ భాగం పూర్తయిందని టీమ్‌ చెబుతోంది. ఇదే వేగంతో మిగిలిన భాగాన్నీ పూర్తి చేసేలా ప్లాన్స్‌ చేస్తున్నారట. మొన్నీ మధ్య చిరంజీవి లీక్‌ చేసినట్లు, అప్పటికే అందరికీ తెలిసినట్లు ఈ నెల 22న సినిమా టీజర్‌ని విడుదల చేయనున్నారు. సినిమా పేరు ‘కదిరి..’ అని ఏదో ఉండనుంది. ఈ డీటైల్స్‌తో పాటు సినిమా విడుదలకు సంబంధించిన వివరాలు ఆ టీజర్‌లో ఉండే అవకాశాలున్నాయి.

మరోవైపు సంక్రాంతి సీజన్‌లో బెర్తుల కోసం అప్పుడే సినిమాలు కర్చీఫ్‌లు వేసేస్తున్నాయి. శర్వానంద్‌ తన కొత్త సినిమా ‘జార్జ్‌ క్రిష్‌’ జనవరి 14 అని డేట్‌ చెప్పగా.. ఇక సంక్రాంతి అనే లైన్‌ పట్టుకుని కచ్చితంగా సంక్రాంతికే వస్తాం అని సినిమాలు తీసే అనిల్‌ రావిపూడి ఇప్పడు వెంకటేశ్‌ – కల్యాణ్‌ రామ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. దీన్ని సంక్రాంతికే అని చెప్పేశారు. డేట్‌ ఇంకా చెప్పలేదు అంతే.

మరోవైపు దిల్‌ రాజు కూడా పొంగల్‌ ఫైట్‌కి రెడీ అయిపోయారు. రవితేజ – శ్రీవిష్ణుతో హసిత్ గోలి ఓ సినిమా చేస్తారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాను ముక్కల పండగని టార్గెట్‌ చేసి తెరకెక్కిస్తారట. నాగార్జున తన వందో సినిమాను సంక్రాంతికే తీసుకొస్తారని సమాచారం. డిసెంబరులో అనుకున్నా ఆ డేట్‌ని కొడుక్కి (వృషకర్మ)కి వదిలేసి.. సంక్రాంతికి వద్దాం అనుకుంటున్నారట. త్వరలో క్లారిటీ వస్తుంది..

చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus