నందమూరి బాలకృష్ణ తనయుడి ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆల్మోస్ట్ 2 ఏళ్ళ క్రితమే మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సంబంధించిన ప్రకటన వచ్చింది. ‘హనుమాన్’ తో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ‘ఎస్ ఎల్ వి’ క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు.
దీనికి కారణాలు ఏంటన్నది ఇప్పటికీ బయటకు రాలేదు. కొంతమంది బాలకృష్ణకి, ప్రశాంత్ వర్మకి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి.. అందుకే ఈ ప్రాజెక్టు ఆగిపోయింది అంటూ ప్రచారం చేశారు. ఇంకొంతమంది మోక్షజ్ఞకి అసలు నటనపై ఆసక్తి లేదని.. అందువల్ల దర్శకుడు ప్రశాంత్ వర్మకి అతను సహకరించలేదు అంటూ చెప్పుకొచ్చారు. కారణాలు ఏమైనా మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్టు స్టార్ట్ అవ్వకపోవడంపై నందమూరి అభిమానులు, ముఖ్యంగా బాలయ్య అభిమానులు హర్ట్ అయ్యారు.
తర్వాత మోక్షజ్ఞ డెబ్యూ గురించి వాళ్ళు కూడా మర్చిపోయారు. అయితే సడన్ గా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అంటూ మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే అది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాదు. వేరే దర్శకుడితో..! అవును మీరు చదువుతున్నది నిజమే..! ఆ దర్శకుడు మరెవరో కాదు మల్లిడి వశిష్ట్(Mallidi Vassishta). ‘బింబిసార’ తో కళ్యాణ్ రామ్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించి టాప్ డైరెక్టర్స్ లిస్టులోకి చేరిపోయాడు మల్లిడి వశిష్ట్.
ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. కానీ ఆ సినిమా ఇప్పటికీ రిలీజ్ అయ్యింది లేదు. వశిష్ట్ కూడా అక్కడే లాక్ అయిపోయాడు. ఆ సినిమా రిలీజ్ తో సంబంధం లేకుండా ఇప్పుడు బాలకృష్ణ కొడుకు డెబ్యూ ప్రాజెక్టు డైరెక్ట్ చేసే అవకాశం పొందడం అంటే చిన్న విషయం కాదు.