Chiranjeevi New look: సాల్ట్ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో మెగాస్టర్‌ చూశారా!

సినిమా కథను, టైటిల్‌ను ముందుగానే రివీల్‌ చేసేస్తుంటారని చిరంజీవికి పేరు. ఏదో సందర్భంలో సినిమాను కథను అనుకోకుండా (?) చెప్పేస్తుంటారు. అలా ఆయన సినిమా పేరును కూడా మొన్నీ మధ్య చెప్పేశారు. అదే ‘ఆచార్య’. ఆ సినిమా తర్వాత ఇప్పుడు చిరంజీవి ‘లూసిఫర్‌’ సినిమా రీమేక్‌ ప్రాజెక్ట్‌ చేయనున్నారు. త్వరలో సినిమా షూటింగ్‌ మొదలవుతుందని టాక్‌. ఈ క్రమంలో ఆ సినిమాలో చిరంజీవి ఎలా కనిపించబోతున్నారనే లుక్‌ బయటకు వచ్చేసింది. అది కూడా ఆయన వల్లనే.

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత రఘువీరారెడ్డి తన స్వగ్రామంలో శిథిలావస్థకు చేరిన కొన్ని దేవాలయాలను పునర్నిర్మించి, మరికొన్నింటిని నూతనంగా నిర్మించారు. దీని కోసం చిరంజీవి అభింనదలు చెబుతున్నట్లు ఓ వీడియో చేసి రఘువీరకు అందించారు. ఆ వీడియోను రఘువీర తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలోనే చిరంజీవి ‘లూసిఫర్‌’ లుక్‌ బయటకు వచ్చేసింది. ‘లూసిఫర్‌’ ఒరిజినల్‌ వెర్షన్‌లో హీరో సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో ఉంటాడు. అంటే తెలుపు, నలుపు కలగలిపిన గెడ్డంలో అన్నమాట. ఈ వీడియోలో చిరంజీవి అలానే కనిపించాడు.

దీంతో చిరు ఫ్యాన్స్‌… ఇదే ‘లూసిఫర్‌’ రీమేక్‌ లుక్‌ అంటూ షేర్‌ చేస్తున్నారు. ఈ విషయంలో పెద్దగా ఆలోచించడానికి ఏమీ లేదు. ఎందుకంటే చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత చేయబోయేది ‘లూసిఫర్‌’ రీమేకే అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే సినిమాలో ఈ లుక్‌ను దర్శకుడు మోహన్‌ రాజా ఎలా ఇంకా కొత్తగా చూపిస్తాడు అనేదే ఇక్కడ ప్రశ్న. అయితే చిరంజీవి సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌ మాత్రం సూపరో సూపర్‌ అసలు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus