Chiranjeevi: కోకాపేటలో చిరంజీవికి ఎన్ని ఎకరాల ఆస్తి ఉందో తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • August 4, 2023 / 07:41 PM IST

గత కొన్నేళ్లలో హైదరాబాద్ మహానగరం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోకాపేటలో ఎకరం 100 కోట్ల రూపాయలు పలకడం హాట్ టాపిక్ అవుతోంది. హైదరాబాద్ లో ఎకరం కొనుగోలు చేసే డబ్బులతో చిన్నచిన్న గ్రామాలలో వందల ఎకరాలను కొనుగోలు చేయవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవికి కోకాపేటలో 20 ఎకరాలు ఉన్నట్టు సమాచారం. ఈ 20 ఎకరాలలో కొంతమొత్తాన్ని చిరంజీవి తన సోదరీమణులకు ఇచ్చారని తెలుస్తోంది.

కోకాపేటలో చిరంజీవికి (Chiranjeevi) భారీగా ఆస్తులు ఉండటంతో ఈ ఆస్తుల విలువను అంచనా వేయడం కష్టమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోకాపేట భూముల విలువ హాట్ కాగా తులసి సినిమాలోని ఝాన్సీకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కోకాపేటలో భూమి ఉంటే ఆ డబ్బులు ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని తెలివిగా ఇన్వెస్ట్ చేశారని తెలుస్తోంది. భూములపై చిరంజీవి పెట్టుబడులు పెట్టడం తెలివైన నిర్ణయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు మరో వారం రోజుల్లో భోళా శంకర్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ ఈ మూవీపై అంచనాలను పెంచడం గమనార్హం. భోళా శంకర్ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని మాస్ ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. మెగా ఫ్యాన్స్ కు విందు భోజనంలా ఈ సినిమా ఉండనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి ఈ సినిమాకు రెమ్యునరేషన్ కు బదులుగా లాభాల్లో వాటా తీసుకోనున్నారని ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus