Chiranjeevi: చిరు.. నెక్స్ట్‌ ఏంటి గురూ?

  • April 6, 2021 / 03:34 PM IST

మెగా అన్నదమ్ములు చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ వరుసగా సినిమాలు మొదలుపెడుతూ, ప్రకటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అయితే ఆ సినిమాల దర్శకులకు మాత్రం టెన్షన్‌ పెరిగిపోతోంది. చిరంజీవి విషయం తీసుకుంటే ఆయన దగ్గర ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. కొరటాల శివ ‘ఆచార్య’ చివరిదశకొచ్చింది. త్వరలో ‘లూసిఫర్‌’ రీమేక్‌ మొదలవుతుంది. మోహన్‌రాజా ఈ సినిమాకు కెప్టెన్‌. దీంతో ఇద్దరు దర్శకుల లెక్క తేలింది. మరి మిగిలిన ఇద్దరి లెక్కో? అదే ఇప్పుడు సమస్య.

చిరంజీవి దగ్గరున్న ఇద్దరు దర్శకులు మెహర్‌ రమేష్‌, బాబి. మెహర్‌ రమేష్‌తో ‘వేదాళం’ రీమేక్‌ చేస్తానని చిరంజీవి ఇప్పటికే ప్రకటించారు. దీని పనులు మొదలయ్యాయని కూడా చెప్పారు. బాబీ సినిమా పరిస్థితి ఏంటి అనుకుంటున్న సమయంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో బాబీ సినిమా ఉంటుందని ప్రకటించి… హమ్మయ్య అనిపించారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరి సినిమా ముందు మొదలవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరి దగ్గరా లేనట్లుంది.

బాబీ డైరక్షన్‌లో రాబోయే సినిమా స్ట్రయిట్‌ మూవీనా, రీమేకా అనేది తెలియడం లేదు. అజిత్‌ ‘ఎంతవాడు గానీ’ సినిమాను రీమేక్‌ చేస్తారని గతంలో వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఆ ఊసు లేదు. దీంతో కొత్త కథే అనుకుందాం. మరి కథ ఓకే అయ్యిందా… ఎప్పుడు స్టార్ట్‌. ఈ కథ ఓకే అయ్యేలోపు ‘వేదాళం’ రీమేక్‌ ప్రారంభిస్తారా? అనేదీ తెలియడం లేదు. చదివే మనకే ఇంత కన్‌ఫ్యూజ్‌ ఉన్నప్పుడు ఆ ఇద్దరు దర్శకులకు ఇంకెంత కన్‌ఫ్యూజన్‌ ఉండి ఉండాలి. బాసూ… కాస్త క్లారిటీ ఇవ్వొచ్చు కదా.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus