మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది.. ‘వాల్తేరు వీరయ్య’ తో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో ‘భోళా శంకర్’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆయన కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసన… లకు పండంటి ఆడపిల్ల పుట్టింది. పెళ్లైన 10 ఏళ్ల తర్వాత తండ్రయ్యాడు చరణ్. దీంతో మెగా ఫ్యామిలీలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడింది. ‘ప్రెగ్నన్సీ లేట్ అవ్వడంతో నేను చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నాను’ అంటూ ఉపాసన ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.
‘ఏ వేడుకకి వెళ్లినా ‘గుడ్ న్యూస్’ ఎప్పుడు?’ అని అడిగే వారు, దీంతో మానసికంగా కష్టంగా ఉండేది’ అని కూడా ఎమోషనల్ కామెంట్స్ చేసింది. అందుకే ఆ విచారకరమైన రోజులకి గుడ్ బై చెబుతూ.. అలాగే తన మనవరాలికి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ కూడా (Chiranjeevi) మెగాస్టార్ ఇండస్ట్రీలో ఉన్న తన మిత్రులందరికీ పెద్ద పార్టీ ఇవ్వబోతున్నారట. ఈ పార్టీ చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉండబోతుందని ఇన్సైడ్ వర్గాల సమాచారం.
ఇదిలా ఉండగా.. రామ్ చరణ్, ఉపాసన తమ కూతురుకి ఏమి పేరు పెడతారు? అనే ఆసక్తి కూడా జనాల్లో ఉంది. చిరు తల్లి అంటే చరణ్ కి నానమ్మ.. అయిన అంజనా దేవి గారి పేరు కలిసొచ్చేలా పేరు పెట్టాలని చూస్తున్నట్టు ఇన్సైడ్ సిర్కిల్స్ న్యూస్. చిరు- సురేఖ దంపతులు .. చరణ్ – ఉపాసన లు తల్లిదండ్రులు కావాలని ఎన్నో గుళ్ళు తిరిగారు, హోమాలు వంటివి కూడా చేశారు. ఇప్పుడు వారు చాలా ఆనందంగా ఉన్నారు.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్