Chiranjeevi: మెగా మద్దతు.. ఇద్దరికి అవసరమే!

  • June 21, 2021 / 09:53 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి రాజకీయ వాతావరణం మొదలైంది. గత కొన్నేళ్లుగా రాష్ట్ర స్థాయి పాలిటిక్స్ కంటే కూడా MAA ఎన్నికలు మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక ఈసారి ఇద్దరు పేరున్న బలమైన సీనియర్ ప్రత్యర్ధులు పోటీ పడుతుండడం అందరి ఫోకస్ ఈ ఎన్నికలపైనే పడింది. మంచు VS ప్రకాష్ రాజ్ ఫైట్ కు రంగం సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ అయితే గట్టిగానే వినిపిస్తోంది. ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలని అనుకుంటున్న మంచు విష్ణు ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ మద్దతు కోరేందుకు మోహన్ బాబుతో కలిసి ఇంటికి వెళ్లారు.

ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న నరేష్ తన మద్దతును విష్ణుకు ఇచ్చినట్లు టాక్. ఇక మరోవైపు ప్రకాష్ రాజ్ ఇప్పటికే ప్రచారలు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి మద్దతు కీలకమని తెలుస్తోంది. ఇక ఎన్నికలు ఎలా జరిగినా కూడా అగ్ర హీరోలు వీలైనంత వరకు వారికి నచ్చిన అభ్యర్థులనే గెలిపిస్తారని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంది. అయితే మెగాస్టార్ అటు వైవు మంచు వారికి సన్నిహితుడే..

అలాగే ఇటువైపు ప్రకాష్ రాజ్ అంటే కూడా కూడా నటపరంగా ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. మరి ఈ సందిగ్ధంలో లో ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అలాగే ఎన్నికల్లో అక్కినేని, కృష్ణంరాజు కుటుంబ సభ్యుల నిర్ణయాలు కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని తెలుస్తోంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus