Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Advertisement

కమల్‌ హాసన్‌ రీసెంట్‌ సోషల్‌ మీడియా పోస్టు మీరు చూసే ఉంటారు. సినిమా నిర్మాణ వ్యయం గురించి ఆయన చక్కటి విశ్లేషణ చేశారు. నిజానికి ఈ చర్చ తెలుగు సినిమాలోనే ఇండియన్‌ సినిమాలో కూడా చాలా ఏళ్లుగా జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో పొదుపు మంత్రం పాటించాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ సూచించిన నేపథ్యంలో.. మరోసారి సినిమా పరిశ్రమలో ఖర్చు నియంత్రణ గురించి చర్చ మొదలైంది. ఇదే సమయంలో కమల్‌ హాసన్‌ ఆ పోస్టు పెట్టారు.

Kamal

కమల్ ఆ పోస్టు పెట్టారని కాదు కానీ.. ఈ విషయంలో సినిమా పరిశ్రమ కచ్చితంగా ఆలోచించాల్సి ఉంది. పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా భారతీయ చిత్ర పరిశ్రమ కూడా ప్రభావితమవుతోంది. పెరుగుతున్న ఖర్చులు సినిమా నిర్మాణాన్ని మాత్రమే ప్రభావితం చేయకుండా.. మరికొన్ని నెలల్లో ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే ఆలోచన చేసే పరిస్థితి రావొచ్చు. దాని వల్ల నిర్మాతలు, కార్మికులు, థియేటర్లు, పంపిణీదారులు, ఫైనాన్షియర్లు ఇబ్బంది పడతారు. అంటే మొత్తంగా సినిమా పరిశ్రమ ఇబ్బందిపడుతుంది.

సినిమా పరిశ్రమ ఇలా ఇబ్బందిపడకూడదు అంటే.. సినిమా నటులు, కార్మికుల జీతాలు, వసతులు మార్చడం కాదు.. సినిమా నిర్మాణ వ్యయం విషయంలో మార్పు రావాలి. మన సినిమాలను గత కొన్నేళ్లుగా చూస్తుంటే.. విదేశీ నేపథ్యం ఎక్కువగా కనిపిస్తోంది. సినిమాకు మంచి హైప్‌ రావాలనో లేక కొత్త కలర్‌ కావాలనో విదేశీ నేపథ్యాలు పెడుతున్నారు. పక్క రాష్ట్రం నేపథ్యం ఉంటే సరిపోయేదానికి విదేశాలకు వెళ్తున్నారు అని చెప్పొచ్చు. ఒకే ఊరిలో తీయాల్సిన కథకు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు.

దీంతో తెలియకుండా పెద్ద ఎత్తున ఖర్చు అవుతోంది. దీనిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మరిప్పుడు ప్రధాని పిలుపు మేరకు ఆ పని చేస్తారేమో చూడాలి. ఆ లెక్కన భారతీయ సినిమా పరిశ్రమంతా ఏకాభిప్రాయానికి రావడానికి ఇదే సరైన సమయం. ఆర్థిక సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో చర్చ జరగాలి. నిర్మాతలు, నటులు, దర్శకులు, యూనియన్లు, స్టూడియోలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కలసి చర్చించుకోవాలి.

రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus