Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

46 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరు హీరోలు కలసి నటిస్తున్న చిత్రం. అందుకే సినిమా అనౌన్స్‌ అయినప్పటి నుండి పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. ఎంతలా అంటే కాంబినేషన్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియోకు సినిమాకు వచ్చినంత ఆదరణ దక్కింది. ఇలాంటి సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్‌ వస్తే ఎవరైనా వద్దనుకుంటారా. కానీ ఆ హీరోయిన్‌ వద్దనుకుంది అని చెబుతున్నారు. అంతేకాదు భారీగా రెమ్యూనరేషన్‌ ఇస్తామని చెప్పినా నో చెప్పింది అని అంటున్నారు.

Trisha

పైన చెప్పిన సినిమా కమల్‌ హాసన్‌ – రజనీకాంత్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా. సినిమా ఏదో అర్థమైంది కాబట్టి ఆ హీరోయిన్‌ త్రిష అని కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. వరుస సినిమాలతో సందడి చేస్తున్న త్రిష కమల్‌ హసన్‌ – రజనీకాంత్‌ కాంబోలో నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందించనున్న సినిమాలో నటిస్తోందని గత కొన్ని రోజులుగా వార్తలొచ్చాయి. ఈ క్రమంలో భారీగా పారితోషికం ఇవ్వనున్నట్లు కూడా వార్తలొచ్చాయి.

దీంతో బెస్ట్‌ మూవీకి బెస్ట్‌ హీరోయిన్‌ అంటూ ప్రచారం జరిగింది. అయితే తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత త్రిష.. సినిమాల ఎంపికలో కొన్ని నిర్ణయాలు తీసుకుందని టాక్‌ వచ్చింది. అందులో భాగంగానే సినిమా కోసం రూ.12 కోట్ల రెమ్యూనరేషన్‌ ఆఫర్‌ చేసినప్పటికీ నటించేందుకు అంగీకరించడం లేదని సమాచారం. భారీ పారితోషికం ఆఫర్‌ చేసినప్పటికీ రిజెక్ట్‌ చేయడం వెనుక మరో బలమైన కారణం ఉందని టాక్‌.

అదే ఈ సినిమా నిర్మాణ సంస్థ. కమల్‌ – రజనీ సినిమాను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌ జెయింట్‌ తెరకెక్కిస్తోంది. ఈ కారణంగానే త్రిష సినిమాకు ముందుకు రావడం లేదు అని చెబుతున్నారు. ఈ చర్చలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇదంతా తేలాంటే సినిమా షూటింగ్‌ మొదలవ్వాలి. అప్పుడే ప్రాజెక్ట్ గురించి అప్‌డేట్స్‌ వస్తాయి. క్లారిటీ కూడా వస్తుంది.

కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus