Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

Advertisement

ప్రపంచ సినిమాలో ఊహించని సినిమాలు అంటూ ఓ లిస్ట్‌ రాస్తే.. అందులో టాప్‌లో వచ్చే సినిమాల్లో ‘అవతార్‌’ ఒకటి. జేమ్స్‌ కామెరూన్‌ తెరకెక్కించిన ఈ చిత్రరాజం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ సినిమా వచ్చినప్పుడు ఆ అద్భుతాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు అని అనుకున్నారు. అయితే ఓ తెలుగు సినిమాలో చెప్పినట్లు అద్భుతం ఎప్పుడూ ఒక్కసారే జరుగుతుంది అన్నట్లుగా ‘అవతార్‌’ చూపించిన మేజిక్‌ ఆ తర్వాత వచ్చిన ‘అవతార్‌ 2’, ‘అవతార్‌ 3’ సినిమాల్లో లేదు. దీంతో నాలుగో ‘అవతార్‌’ వస్తుందా? అనే అనుమానం మొదలైంది. దీనిపై తాజాగా దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ స్పందించారు.

Avatar 4

‘అవతార్‌’ ఫ్రాంఛైజీలో మొత్తం 5 సినిమాలను తీసుకురానున్నట్లు జేమ్స్‌ కామెరూన్‌ ఇప్పటికే ప్రకటించారు. తొలి సినిమా విజయం తర్వాత ఈ ప్రకటన జరిగింది. ఇప్పటికే ఇందులో మూడు సినిమాలు ‘అవతార్‌ 4’ అప్‌డేట్‌ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల జరిగిన శాటర్న్‌ అవార్డుల వేడుకలో జేమ్స్‌ కామెరూన్‌ నాలుగో ‘అవతార్‌’ సినిమాపై స్పందించారు. ప్రస్తుతానికి ఆ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని షాక్‌ ఇచ్చారు. అయితే సినిమా ఉంటుందని మాత్రం చెప్పారు.

‘అవతార్‌’ సీక్వెల్‌పై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కానీ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశం పుష్కలంగా ఉంది. ఈ విషయంలో ప్రేక్షకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకుంటాం. ఇప్పటివరకూ వచ్చిన మూడు చిత్రాలను మరోసారి సమీక్షించుకుని ముందుకు వెళ్తాం అని చెప్పారు. ఒకవేళ అదే జరిగితే సినిమా ముందుకు వెళ్లడం కష్టమే అని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి పార్ట్‌ ఇచ్చినంత కిక్‌.. ఆ తర్వాత వచ్చిన రెండు, మూడు పార్ట్‌లు ఇవ్వలేదు.

ఒకే కథను నేపథ్యం మార్చి మార్చి విజువల్స్‌తో మాయ చేస్తున్నారనేది కాదలేని విషయం. అందుకే ‘అవతార్ 4’ విషయంలో ప్రేక్షకుల అభిప్రాయాలను తీసుకుంటానని అంటున్నారు అని చెప్పొచ్చు. మరోవైపు ఆయన వయసు 70 దాటింది. ఈ నేపథ్యంలో మరో రెండు సినిమాలకు కథను సిద్ధం చేసుకుని, ఒకేసారి షూటింగ్‌ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారని వార్తలొస్తున్నాయి. గతంలో తేదీల ప్రకారం అయితే ‘అవతార్‌ 4’ని 2029లో, ‘అవతార్‌ 5’ని 2031లో రిలీజ్‌ చేయాలి.

‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news