నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందిన హిలేరియస్ ఎంటర్టైనర్ మూవీ ‘జాతి రత్నాలు'(Jathi Ratnalu). ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు.
2021 మార్చి 11న చాలా సైలెంట్ గా రిలీజ్ అయ్యింది ఈ సినిమా. దీనికి పోటీగా శర్వానంద్ ‘శ్రీకారం’ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. ఆ టైంలో శర్వానంద్ కి క్రేజ్ ఎక్కువ. కాబట్టి..విడుదలకి ముందు ఆడియన్స్ కి ఫస్ట్ ఛాయిస్ అంటే ‘శ్రీకారం’ ఉండేది.
కానీ ఆ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. మరోవైపు ‘జాతి రత్నాలు’ కి పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో 2వ రోజు నుండి ఈ సినిమా లీడ్ తీసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ మార్చి 11వ తేదీకి ‘జాతి రత్నాలు’ రిలీజ్ అయ్యి 5 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ నేపధ్యంలో క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 16.00 cr |
| సీడెడ్ | 4.27 cr |
| ఉత్తరాంధ్ర | 3.97 cr |
| ఈస్ట్ | 1.92 cr |
| వెస్ట్ | 1.52 cr |
| గుంటూరు | 2.09 cr |
| కృష్ణా | 1.84 cr |
| నెల్లూరు | 0.91 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 32.52 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.72 cr |
| ఓవర్సీస్ | 4.28 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 38.52 cr |
‘జాతి రత్నాలు’ చిత్రం రూ.11.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా 38.52 కోట్ల షేర్ ను రాబట్టింది.ఓవరాల్ గా బయ్యర్లకు 27.22 కోట్ల లాభాలను అందించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘జాతి రత్నాలు’ తో దర్శకుడు అనుదీప్, హీరో నవీన్ పోలిశెట్టి స్టార్స్ అయిపోయారు.