జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రాకింగ్ రాకేష్ ఒకరు. ఈయన జబర్దస్త్ కమెడియన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అనంతరం తన టీం లో కమెడియన్ గా పనిచేస్తున్నటువంటి జోర్దార్ సుజాతను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక కమెడియన్ గా జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతూనే మరోవైపు ఈయన హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టారు.
రాకింగ్ రాకేష్ కెసిఆర్ (కేశవ్ చంద్ర రమావత్) ఈ సినిమాను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా తాజాగా మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా ఎంతో ఘనంగా ప్రారంభమైంది అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రాకింగ్ రాకేష్ ఈ సినిమా గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు. ఇక ఈ సినిమాకు రాకేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ ఈ సినిమాకు తాను ఎందుకు నిర్మాతగా మారాల్సి వచ్చింది అనే విషయాలను తెలియజేశారు.
ఈ సినిమా కథ విన్న తర్వాత కొంతమంది వ్యక్తులు నాకు మాట ఇచ్చారు. ఈ సినిమాని మేము నిర్మిస్తామని చెప్పారు అయితే చివరి క్షణంలో వాళ్ళు హ్యాండ్ ఇవ్వడంతో ఈ సినిమాకు తానే నిర్మాతగా మారాల్సి వచ్చిందని ఈయన తెలియజేశారు. ఇక ఈ సినిమా ప్రారంభం కాకముందే తాను తన కారును అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చిందని రాకేష్ తెలిపారు. ఈ సినిమాని చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అన్న ఉద్దేశంతోనే సినిమా అని ప్రారంభించామని
అయితే ఒక సినిమా చేయాలి అంటే కోట్ల వ్యవహారంతో కూడినది అందుకే తనకెంతో ఇష్టమైన తన తల్లి కోసం కట్టించిన ఇంటిని కూడా తాను తాకట్టు పెట్టానని ఈయన తెలియజేశారు. అయితే ఈ విషయంలో తన కుటుంబం మొత్తం తనని చాలా ప్రోత్సహిస్తుందని ముఖ్యంగా సుజాత నా వెనుకుండి నన్ను ముందుకు నడిపిస్తుందని తెలిపారు. అవసరమైతే నా కారు కూడా అమ్మేయండి నా బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం మీ చేతిలో పెడతాను అంటూ తనని బాగా సపోర్ట్ చేసింది అంటూ ఈ సందర్భంగా (Rocking Rakesh) రాకేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!