కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడంలో నాగార్జున కూడా ముందుంటుంటారు. చాలామంది కొత్త కుర్రాళ్లు ఆయన బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో లాంచ్ అయ్యారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన దీనికి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు తిరిగి తన పాత పంథాలోకి వస్తున్నారనిపిస్తోంది. ఆయన బ్యానర్‌లో తాజాగా ఓ కుర్ర కమెడియన్‌ను దర్శకుడిగా లాంచ్ చేయబోతున్నారట. అతనే కమెడియన్ ప్రవీణ్. గోదావరి యాసలో, తనదైన శైలిలో మెప్పించిన ప్రవీణ్.. ఇప్పుడు దర్శకుడిగానూ అలరించడానికి సిద్ధమవుతున్నాడట.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై వరుసగా చిన్న సినిమాలు తీయాలని నాగార్జున ఇటీవల నిర్ణయించారు. దీని కోసం కొత్త కుర్రాళ్ల కథలు వింటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ చెప్పిన కథ నాగ్‌కి బాగా నచ్చిందట. అందుకే దాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయించారట. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. దీనికి నాగ్ ఐదారు కోట్ల బడ్జెట్ కూడా కేటాయించారని తెలుస్తోంది. అయితే ఇందులో ఎవరు నటిస్తారనే విషయంలో క్లారిటీ లేదు.
ప్రస్తుతం నాగార్జున రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ చేస్తుండగా, ప్రవీణ్ సత్తారుతో మరో సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ త్వరలో అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమవుతుందట. దాంతోపాటు ప్రవీణ్ సినిమా కూడా మొదలుపెడతారని సమాచారం. రాహుల్ రవీంద్రన్‌తో కూడా నాగ్ నిర్మాతగా ఓ సినిమా చేస్తున్నారని టాక్ వచ్చింది. అది కూడా ఇప్పుడే మొదలవ్వొచ్చని టాక్.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?