Maniratnam-Kamal Haasan: కమల్‌ – మణిరత్నం సినిమా టీజర్‌తోనే రచ్చ మొదలైందిగా.. ఏ సినిమాతో పోలికంటే?

  • November 8, 2023 / 09:04 PM IST

సినిమా పోస్టర్, టీజర్‌, ట్రైలర్‌, గ్లింప్స్‌… ఇలా ఏది వచ్చినా దాని బట్టి కథలను అల్లేస్తున్న రోజులివి. అలాగే ఆ కంటెంట్‌ను పట్టుకుని దీనికి ఒరిజినల్‌ వేరే ఉందా? అంటూ వెతికేస్తున్నారు. తాజాగా వచ్చిన ‘థగ్ లైఫ్‌’ సినిమా టీజర్‌ను కూడా ఇలానే సూలశోధన చేసేశారు. ఈ క్రమంలో ఈ సినిమా ఫుటేజ్‌కు అసలు రూపం ఇదీ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. మణిరత్నం కూడా కాపీకి అనర్హం కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే…

సుమారు మూడు దశాబ్దాల తర్వాత కమల్‌ హాసన్‌ – మణిరత్నం కలసి ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్‌ చేయగానే కథ ఎలా ఉంటుంది, కథనం ఏంటి, నటీనటులు ఎవరు అంటూ అంచనాలు వేయడం ప్రారంభించారు. సినిమా అనౌన్స్‌మెంట్ ఎలా ఉంటుంది? ఎలా చెబుతారు లాంటి చర్చలూ సాగాయి. అయితే ఇప్పుడు చర్చ మరోవైపునకు తిరిగింది. అదే ఈ సినిమాలో సీన్స్‌ కాపీ కంటెంటా అని. అదేంటి క్రియేటివ్‌ డైరక్టర్‌ అని మణిరత్నంకు పేరు కదా.. కాపీ ఏంటి అని అనుకుంటున్నారా?

ఓసారి సోషల్‌ మీడియాలో చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. అంతలా సినిమాను ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. ‘థగ్‌ లైఫ్‌’ అని చెప్పి హాలీవుడ్‌ కథలు ఎత్తేస్తారా? టీజర్‌ కూడా అక్కడిలానే తెరకెక్కిస్తారా అని అడుగుతున్నారు. హాలీవుడ్ సినిమా ‘రైజ్ ఆఫ్ స్కై వాకర్’లో హీరో క్యారెక్టర్‌కు కమల్‌ పాత్ర దగ్గరగా ఉందీ అనేది నెటిజన్ల మాట. అలాగే టీజర్‌లో వరకు అయితే విజువల్ బ్యాక్ డ్రాప్ కూడా ఒకేలా ఉంది. దీంతో మణిరత్నం, కమల్‌ (Kamal Haasan) కూడా హాలీవుడ్ చిత్రాలను కాపీ కొడతారా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

మరోవైపు నాలుగేళ్ల క్రితం వచ్చిన ఆ సినిమాకు, ఈ టీజర్‌లోని మ్యూజిక్‌కు సంబంధం లేదు. కాబట్టి రెండూ వేర్వేరు అంటూ మరో వాదన తీసుకొస్తున్నారు కమల్‌ అభిమానులు. దీంతో ఈ చర్చ కొన్నాళ్లు సాగేలా ఉంది. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌ కాగా, దుల్కర్ సల్మాన్, జయం రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus