Adipurush: కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అర్థమవుతుంది: సెహ్వాగ్

  • June 26, 2023 / 11:29 PM IST

ప్రభాస్ తాజాగా నటించిన ఆది పురుష్ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే. రామాయణం ఇతిహాసం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటినుంచి నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా భారీగా పడిపోయానే తెలుస్తుంది. ఈ సినిమాలో నటీనటుల పట్ల కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఈ సినిమా చూసిన అనంతరం సినిమాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ కామెంట్లు చేశారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా గురించి ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆది పురుష్ సినిమా చూసిన అనంతరం వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారో అర్థమవుతుంది అంటూ ట్వీట్ చేశారు. ఈ విధంగా వీరేంద్ర సెహ్వాగ్ ఈ సినిమాకు ఈ విధమైనటువంటి రివ్యూ ఇవ్వడంతో ఈయన చేసిన కామెంట్లపై పెద్ద ఎత్తున లైక్స్ కురిపిస్తున్నారు.

అయితే ప్రభాస్ (Adipurush) అభిమానులు మాత్రం కొంత పాటి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ సినిమాకు ఇలా సెహ్వాగ్ నెగిటివ్ గా స్పందించాల్సిన అవసరం ఏముంది అంటూ మండిపడుతున్నారు. మరి సెహ్వాగ్ చేసిన ఈ కామెంట్లపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ అసలు రాముడిగానే కనిపించలేదని రావణాసురుడి వేషధారణ పూర్తిగా మార్చేశారు అంటూ పెద్ద ఎత్తున వీరి పాత్రలపై విమర్శలు వచ్చాయి.

అయితే ఈ సినిమా గురించి దర్శకుడు రచయిత చేసిన కామెంట్లు కూడా పెద్ద ఎత్తున వివాదంగా మారాయి. ఏది ఏమైనా ప్రభాస్ వంటి ఒక స్టార్ హీరో సినిమా ఇలాంటి విమర్శలను ఎదుర్కోవడంతో అభిమానులు దర్శకుడు పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus