Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మొన్నామధ్య ‘దేనికైనా రెడీ’ సినిమా రూ.42 కోట్లు కలెక్ట్ చేసింది అంటూ మంచు విష్ణు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున ట్రోలింగ్ కి దారి తీసింది. ‘మంచు విష్ణు కెరీర్లో అంత మొత్తం కలెక్ట్ చేసిన సినిమా ఉందా?’ ఇంకొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు. 2012 లో రిలీజ్ అయిన ‘దేనికైనా రెడీ’ (Denikaina Ready) సినిమాని దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి తెరకెక్కించారు. ఇది మలయాళం సినిమా ‘ఉదయపురం సుల్తాన్’కి రీమేక్.

Denikaina Ready

చక్రి- యువన్ శంకర్ రాజా..వంటి ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఈ సినిమాకి సంగీతం అందించారు. రిలీజ్ టైమ్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు.కానీ ప్రభాస్ ఈ సినిమాలో ‘మంచు విష్ణుకి డబ్బింగ్ చెప్పాడు’ అంటూ ప్రమోట్ చేసుకుని క్యూరియాసిటీ క్రియేట్ చేశారు.

రిలీజ్ తర్వాత ఈ సినిమాపై బ్రాహ్మణ సంఘాలు వ్యతిరేకిస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఆ వివాదం ఈ సినిమాకి భారీ పబ్లిసిటీ తీసుకొచ్చింది. ‘అంతలా ఈ సినిమాలో ఏముందా?’ అని టార్గెటెడ్ ఆడియన్స్ ఈ సినిమాని ఎగబడి చూశారు. దీంతో మంచు విష్ణు కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ ను సాధించింది. ఈ అక్టోబర్ 24కి ‘దేనికైనా రెడీ’ సినిమా రిలీజ్ అయ్యి 14 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం  5.02 cr
సీడెడ్  2.10 cr
ఉత్తరాంధ్ర  1.85 cr
ఈస్ట్  0.65 cr
వెస్ట్  0.52 cr
గుంటూరు  1.38 cr
కృష్ణా  0.70 cr
నెల్లూరు  0.50 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  12.72 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.52 cr
ఓవర్సీస్  0.60 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  13.84 cr (షేర్)

 

‘దేనికైనా రెడీ’ చిత్రం రూ.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా ఏకంగా రూ.13.84 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. రూ.25 కోట్ల వరకు కొల్లగొట్టింది. మొత్తంగా బయ్యర్స్ కి ఈ సినిమా రూ.7.84 కోట్ల లాభాలు అందించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా పోటీగా ఉన్నప్పటికీ.. ‘దేనికైనా రెడీ’ సినిమా అంత మొత్తం కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు.

‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus