కమల్ హాసన్, రజనీకాంత్ కలసి నటిస్తే చూడాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒకవేళ అనిపించకపోతే వాళ్లిద్దరూ కలసి వస్తే వచ్చే వైబ్ గురించి పెద్దగా అవగాహన లేకపోయి ఉండాలి. ఎందుకంటే ఆ రెండు పవర్ హౌస్‌లు కలసి వస్తే ఎలా ఉంటుందో సౌత్ సినిమా సీనియర్ ప్రేక్షకులకు బాగా తెలుసు. 21 సినిమాల్లో ఇద్దరినీ ఒకే తెరపై చూసి మహాదానంద పడ్డారు వారంతా. ఇప్పుడు రజనీ, తలైవా కలసి వస్తున్నారు అంటే అందుకే వారు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అయితే ఇదిగో, అదిగో అంటూ గత కొన్నేళ్లుగా ఈ వార్త చక్కర్లు కొడుతూనే ఉంది.
మొన్నీ మధ్య ఒకసారి రజనీ – కమల్ కాంబో అంటూ ఓ సినిమా అనౌన్స్ అయింది. అయితే అది హీరో – నిర్మాత కాంబినేషన్ అని ఉత్సాహాన్ని నీరుగార్చారు. కానీ ఎవరూ ఊహించని విధంగా KH x RK అంటూ సినిమాను అనౌన్స్ చేశారు. పోస్టర్‌తో సినిమా గురించి చెప్పేసిన టీమ్ ఇప్పుడు ఓ వీడియోను రిలీజ్ చేసి మరింత డీటెయిల్స్ ఇచ్చారు. అయితే చిన్న డౌట్ క్లియర్ చేసి వదిలేశారు. అదే ఈ సినిమాలో హీరో ఎవరు అని. అదేంటి ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? ఆ ప్రశ్న అడిగింది కమల్, రజనీనే.
కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ నటిస్తున్న సినిమాను ఇప్పుడు సిబి చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అంటూ ఆయనకు ముందు చాలా మంది పేర్లు వినిపించాయి. అందులో నెల్సన్ దిలీప్ కుమార్ పేరు కూడా వినిపించింది. ప్రస్తుతం ఆయన ‘జైలర్ 2’ సినిమా పనులు జరుగుతున్నాయి. అయితే చాలా పేర్లు తర్వాత చర్చలోకి వచ్చాయి. దీంతో నెల్సాకి ఇక ఈ కాంబోను డైరెక్ట్ చేసే అవకాశం లేదు అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇద్దరినీ డైరెక్ట్ చేసే ఛాన్స్ పొందారు.
ఈ సినిమాకు మ్యూజిక్ ఎవరు అనే డౌట్ అస్సలు అక్కర్లేదు. ఈ మొత్తం కాంబో బాగా దగ్గర వ్యక్తి అయిన అనిరుధ్ ఈ సినిమా మ్యూజిక్ అందిస్తారు. ఈ మేరకు స్పెషల్ అనౌన్స్మెంట్ వీడియోలో అనిరుథ్ తనదైన శైలిలో నవ్వించాడు కూడా. అన్నట్లు వీడియో ఆఖరులో ‘హీరో ఎవరు?’ అని ఓ ప్రశ్న రేపారు.