Devara Movie: రూ.350 కోట్ల బిజినెస్ తో ఎన్టీఆర్ దేవర సంచలనం.. కానీ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా తాజాగా బిజినెస్ మొదలుపెట్టింది. గ్లింప్స్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు పెరగడంతో దేవరకు రికార్డ్ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు 27 కోట్ల రూపాయలకు అమ్ముడవగా ఈ సినిమా నైజాం హక్కుల కోసం 50 కోట్ల రూపాయలు నిర్మాతలు ఆశిస్తున్నారని సమాచారం అందుతోంది. దిల్ రాజు లేదా మైత్రీ నిర్మాతలు ఈ సినిమా హక్కులను 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.

దేవర ఆడియో రైట్స్ 33 కోట్ల రూపాయలకు డిజిటల్ రైట్స్ 155 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. ఈ విధంగా రిలీజ్ కు ముందే దేవరకు 250 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరగగా ఆంధ్ర, ఇతర ఏరియాల హక్కులతో మరో 100 కోట్ల రూపాయల బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు థియేట్రికల్ రైట్స్ ద్వారా 200 కోట్ల రూపాయల భారీ టార్గెట్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఈ టార్గెట్ ను రీచ్ కావడం సులువు కాదు.

దేవర సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే ఈ రేంజ్ లో కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. దేవర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే దేవర2 సినిమాకు ఊహించని రేంజ్ లో బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. దేవర సినిమాలో బాలీవుడ్ నటులకు ఎక్కువగా ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో హిందీలో ఈ సినిమాకు కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.

దేవర (Devara) హిందీ రైట్స్ కు కూడా భారీ స్థాయిలో డిమాండ్ ఉంది. రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వస్తే దేవర సినిమా ప్రమోషన్స్ లో వేగం మరింత పుంజుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. దేవర సినిమా సోలో హీరోగా తారక్ కోరుకున్న భారీ హిట్ అందించే అవకాశాలు అయితే ఉన్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus