ఐటెమ్‌ సాంగ్‌తో శభాష్‌ అనిపించుకున్న దేవీ

Advertisement

అల్లు అర్జున్‌ – సుకుమార్‌.. మధ్యలో దేవిశ్రీప్రసాద్‌. టాలీవుడ్‌లో బెస్ట్‌ మ్యూజికల్‌ ఆల్బమ్‌కి అడ్రెస్‌గా చెప్పొచ్చు. ఇప్పటివరకు వీరి కాంబోలో వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య 2’, పాటలు ఎంత బాగుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో ఆయా సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ‘అ అంటే అమలా పురం…’, ‘రింగ రింగ..’ పాటల ది బెస్ట్‌. ఇప్పుడు అలాంటి బెస్ట్‌ మరొకటి సిద్ధమైంది. ‘పుష్ప’ కోసం ఈ ట్రయో కలిసి మరోపాటను ప్రేక్షకులకు ఇవ్వబోతోంది. ఇటీవల ఈ పాట గురించి దేవిశ్రీ చెప్పాడు.

‘‘పుష్ప’లో ప్రత్యేక గీతం ఇప్పటికే సిద్ధమైంది. బన్నీ డార్లింగ్‌ ఒక పక్క, సుక్కూ భాయ్‌ ఒక పక్క. ఈ కలయికలో మంచి సంగీతం వినబోతున్నారు. బన్నీ అయితే సెట్స్‌ నుంచి ఫోన్‌ చేశాడు. ‘‘దేవీ… ఎలాగో సుక్కు సినిమా అంటే అదరగొడతావని తెలుసు కానీ, ఇది అంచనాల్ని మించి వెళ్లిపోయింది’’ అంటూ మెచ్చుకున్నాడు. అంతేకాదు లొకేషన్‌లోనే నిర్మాత దిల్‌ రాజుకి కూడా పాట వినిపించాం. ఆయన కూడా చాలా బాగుందంటూ ఫోన్‌ చేశారు’’ అని చెప్పుకొచ్చాడు దేవిశ్రీప్రసాద్‌. ఇలా మాటలతో సినిమా పాటల గురించి హైప్‌ పెంచేస్తున్నారు.

ఇప్పటికే ‘పుష్ప’కు సంబంధించిన ఓ పాట లీక్‌ అయ్యింది. కొన్ని స్టిల్స్‌ కూడా బయటకు వచ్చేశాయి. రంపచోడవరం ప్రాంతంలో షూటింగ్‌ జరిగిన సందర్భంగా ఈ స్టిల్స్‌, వీడియో ఫుటేజ్‌ లీక్‌ అయ్యింది. లీక్‌ అయిన పాటను విని అభిమానులు ఆనందపడుతున్న ఈ సమయంలో ఇలా ఐటెమ్‌ సాంగ్‌ గురించి దేవీ ఆకాశానికెత్తేయడం మరింత ఉత్సాహాన్నిస్తోంది. చూద్దాం ఈ హిట్‌ ట్రయోను పాటల విషయంలో అంత తక్కువగా అంచనా వేయలేం.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus