Dhanush And Mrunal: వైరల్ అవుతున్న ధనుష్, మృణాల్ లవ్ సింబల్ కామెంట్స్…….!

ధనుష్ ఈ పేరుకి అటు తమిళ్లో కానీ, తెలుగు ప్రేక్షకుల్లో కానీ ఉన్న క్రేజ్ ఏ వేరు. రజినికాంత్ అల్లుడు అయినా కూడా ఏ రోజు ఆ ఫేమ్ ను తాను యూజ్ చేసుకోలేదు. తన సొంత కష్టంతో ఎదిగిన నటుడు ధనుష్. తమిళ్, తెలుగు లోనే కాకుండా హిందీ లోను మూవీస్ చేసాడు ఈ హీరో. అయితే విలక్షణ నటనతో పాటు అద్భుతమైన డాన్సులు కూడా ధనుష్ సొంతం. ఈ మధ్యలోనే వ్యక్తి గత కారణాలతో 2024లో ఐశ్వర్య రజినీకాంత్ తో విడాకులు తీసుకున్నాడు.

Dhanush And Mrunal

తరువాత తాను వరుస మూవీస్ తో బిజీగా ఉంటూ వస్తున్నాడు. అయితే ఆ మధ్య ధనుష్ & సీతారాం బ్యూటీ మృణాల్ ఠాకూర్ డేటింగ్లో ఉన్నట్టు కొన్ని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. దీని పై స్పందిస్తూ అలాంటిది ఏమీ లేదంటూ క్లారిటీ ఇచ్చారు ధనుష్ & మృణాల్. అయితే మృణాల్ నటిస్తున్న “ధో దీవానే షెహర్ మే” మూవీ కి సంబందించిన టీజర్ తాజాగా విడుదలైనది.

మృణాల్ ఈ టీజర్ ని ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేయగా ధనుష్ “చాలా బాగుంది” అనే అర్ధం వచ్చేలా స్పందించారు. మృణాల్ లవ్ సింబల్ తో రిప్లై ఇచ్చారు. దీంతో ఇదంతా చూసిన నెటిజెన్లు వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఎదో నడుస్తుంది అని చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇదంతా వైరల్ గా మారింది. వాళ్ళు ఏమీ లేదు అని క్లారిటీ ఇచ్చినా కూడా చిన్న ఎమోజితో కథలు అల్లేసుకుంటున్నారు నెటిజన్స్.

హీరోయిన్ మృణాల్ తెలుగులో సీతారామం లాంటి అద్భుతమైన సినిమా తరువాత హీరో నానితో హాయ్ నాన్నా మూవీతో మరో హిట్ అందుకుంది. దాని తరువాత వచ్చిన రౌడీబోయ్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.

‘రాజు’ గారి ప్లాన్ మారింది.. పండగ రేసులో వెనకడుగు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus