Kuberaa: ‘కుబేర’ లో ధనుష్ పాత్ర పై ప్రశంసలు… ఆస్కార్ అవార్డు కూడా తక్కువే

Advertisement

ధనుష్ (Dhanush) తమిళ్ లో పెద్ద స్టార్ హీరో. ఒకప్పుడు రజినీకాంత్ కి పెద్దల్లుడు. ఇప్పుడు కాదు. అయినప్పటికీ అక్కడ పెద్ద స్టార్ హీరోనే. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చాడు. ధనుష్ (Dhanush) సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం అక్కడి ఇండస్ట్రీ జనాల్లో, ట్రేడ్ వర్గాల్లో ఉంది.

Kuberaa

అక్కడ ధనుష్ (Dhanush) సినిమాలు ఈజీగా రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తుంటాయి. దర్శకుడిగా, సింగర్ గా, నిర్మాతగా కూడా ధనుష్ (Dhanush) సినిమాపై ఉన్న ప్యాషన్ ను చాటుకున్నాడు. అలా కూడా సక్సెస్..లు అందుకున్నాడు. తాను కావాలనుకుంటే పెద్ద స్పాన్, పెద్ద బడ్జెట్, పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేసుకోవచ్చు.

తన రేంజ్ పెంచుకోవచ్చు. కానీ ధనుష్ (Dhanush) మొదటి నుండి వైవిధ్యమైన సినిమాలే చేస్తూ వస్తున్నాడు. ఎలాంటి పాత్రలైనా వేయడానికి అతను వెనుకాడడు. తాజాగా అతను ‘కుబేర’ (Kuberaa) సినిమాలో చేసిన బిక్షగాడి పాత్రను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఓపెనింగ్ సీన్ తిరుపతి రోడ్ల మీద అడుక్కునే సీన్. ఇందులో ధనుష్ (Dhanush) వేషధారణ చూస్తే ఎవ్వరైనా షాక్ అవుతారు.

ఓ వంద కోట్ల మార్కెట్ ఉన్న స్టార్ హీరో ఇలాంటి పాత్ర చేస్తాడని ఎవ్వరైనా అనుకుంటారా? అసలు ఈ పాత్ర గురించి దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) .. ధనుష్ కి ఎలా చెప్పాడు. వేరే హీరో అయితే దర్శకుడు కథ చెబుతున్నప్పుడు వెంటనే లేచి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) వంటి వాళ్ళు కూడా ఈ పాత్రకు ఒప్పుకుంటారన్న గ్యారెంటీ లేదు. ధనుష్ కి ఉన్న గట్స్ ఏ సౌత్ హీరోకి లేదు అనడంలో కూడా అతిశయోక్తి అనిపించుకోదు. ఈ పాత్రకు గాను అతను ఆస్కార్ అవార్డు అందుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

కొత్త కారు కొనుగోలు చేసిన సందీప్ రెడ్డి వంగా.. ధర ఎంతో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus