Dhanya Balakrishna: నేను తాగుతాను అనే మాట నిజం కానీ : ధన్య బాలకృష్ణ

  • May 16, 2021 / 01:50 PM IST

నటి ధన్య బాలకృష్ణ అందరికీ సుపరిచితమే..! సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. చిత్రంతో బాగా పాపులర్ అయ్యింది. అంతకు ముందు ఈమె సెవెంత్ సెన్స్, ఎటో వెళ్ళిపోయింది మనసు, లవ్ ఫెయిల్యూర్ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. చిత్రమే ఈమెకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. అటు తర్వాత ఈమెకు రన్ రాజా రన్, రాజా రాణి, సావిత్రి, నేను శైలజ, జయ జానకి నాయక,

అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇదిలా ఉండగా.. ఈమె మందు తాగే సీన్లలో ఎక్కువగా నటిస్తూ ఉంటుంది. నేను శైలజ , జయ జానకి నాయక, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి వంటి సినిమాల్లో ఈమె మందు తాగుతూ కనిపిస్తుంది. దాంతో ఈమె నిజ జీవితంలో కూడా మందు తాగుతుంది అనే కామెంట్లు ఎక్కువయ్యాయి. ఇలాంటి వాటి పై తాజాగా ధన్య బాలకృష్ణ స్పందించింది.

‘ నేను ఎక్కువ తాగుతాను అనే మాట నిజమే..! కానీ మందు కాదు.. కాఫీ ఎక్కువగా తాగుతాను. పాత్రలు డిమాండ్ చేయడం వలన కొన్ని సినిమాల్లో అలా నటించాను కానీ… మద్యం సేవించడం నాకు అస్సలు నచ్చదు. ఆ వాసన వచ్చినా నాకు వాంటింగ్స్ వస్తాయి ‘ అంటూ క్లారిటీ ఇచ్చింది ధన్య బాలకృష్ణ.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus