యాభై, అరవై వయసు దాటిన హీరోలు కుర్ర భామలతో రొమాన్స్ చేయడం చాలా సినిమాల్లో చూశాం.. చూస్తూనే ఉన్నాం. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కాలం నుండి ఇలా జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్ల ఈ విషయంపై మాట్లాడారు. తాజాగా నటి దియా మీర్జా కూడా ఈ విషయంపై స్పందించింది. హైదరాబాద్ కి చెందిన ఈ బ్యూటీ ఇప్పటివరకు బాలీవుడ్ చిత్రాల్లోనే నటించింది. నాగార్జున నటిస్తోన్న ‘వైల్డ్ డాగ్’ సినిమాతో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది.
39 ఏళ్ల ఈ బ్యూటీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీలో హీరోల వైఖరి ఎలా ఉంటుందో చెప్పుకొచ్చింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని(బాలీవుడ్) ఏలుతున్న హీరోలంతా కూడా 50 దాటినా వారేనని.. కానీ వారంతా కూడా 19, 20 ఏళ్ల వయసు భామలతో నటిస్తున్నారని.. వాళ్ల కూతురు వయసున్న భామల సరసన నటించి తాము కూడా యంగ్ అనే ఫీలింగ్ లో ఉంటున్నారని చెప్పింది. అదే ఒక హీరోయిన్ కి వయసు 35 దాటిందంటే ఆమెకి కనీసం అవకాశాలు కూడా రావని.. హీరోకి 50 దాటినా ఆయన కోసం స్పెషల్ గా స్టోరీస్ రాస్తుంటారని వెల్లడించింది.
దియా మీర్జా బాలీవుడ్ గురించి మాట్లాడినప్పటికీ దాదాపు అన్ని ఇండస్ట్రీలలోనూ ఇలానే జరుగుతుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీలలో ఉన్న స్టార్ సీనియర్ హీరోలంతా కూడా కుర్ర హీరోయిన్లతో కలిసి నటిస్తున్నారు. కానీ అభిమానులు అవేవీ పెద్దగా పట్టించుకోరు. వాళ్లకి తమ అభిమాన హీరో ఎప్పుడూ యంగ్ గానే కనిపిస్తారు.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!