టాలీవుడ్ లో యంగ్ టైగర్ రేంజ్ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు…హిట్స్ పరంగా పెద్ద భారీ హిట్స్ లేనప్పటికీ తాజాగా వచ్చిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలు ప్రభంజనం సృష్టించి ఎన్టీఆర్ రేంజ్ ను పెంచాయి. ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ తన మార్కెట్ ను పెంచుకునే క్రమంలో మలయాళంలో మోహన్ లాల్ తో కలసి జనతా గ్యారేజ్ సినిమాని తెరకెక్కించాడు. అయితే ఆది ఎన్టీఆర్ కు కలసి వచ్చిందో లేదో తెలీదు కానీ మోహన్ లాల్ కి మాత్రం బాగా కలసి వచ్చింది అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే….జనత గ్యారేజ్ సినిమాతో ఎన్టీఆర్ ఒక భారీ ప్రయత్నం చేసాడు, మోహన్ లాల్ అడిగినంత చేతిలో పెట్టు కేరళ మార్కెట్ కొసం అంటూ అంత పెద్ద స్టార్ ని పట్టుకొచ్చి తన సినిమాలో పెట్టుకున్నాడు.
సినిమా సూపర్ హిట్ అయ్యి బంపర్ కలక్షన్ లు రాబట్టడం కూడా జరిగింది. కానీ ఎన్టీఆర్ పరంగా మోహన్ లాల్ కేరళ లో ఏమైనా ఉపయోగ పడ్డాడా అంటే లేదనే చెప్పాలి. మంచి రేటు కి సినిమాని అమ్మేసుకున్న మోహన్ లాల్ కనీసం ఎక్కువ థియేటర్ లలో సినిమాని విడుదల కూడా చెయ్యలేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎన్టీఆర్ కి మోహన్ లాల్ చేసిన బెనిఫిట్ మచ్చుకైనా లేదు. ఎన్టీఆర్ వల్ల మాత్రం ఆయన బాగానే లాభాపడ్డాడు. మోహన్‌లాల్ నటనను, ఆయన మంచితనాన్ని తక్కువ చేసే ఉద్ధేశ్యం లేదు కానీ ఇప్పుడు మోహన్‌లాల్ మలయాళం సినిమాలు… తెలుగులో రిలీజ్‌కి రెడీ అవుతూ ఉంటే మాత్రం ఎన్టీఆర్ వలన లాభపడిన మోహన్‌లాల్ మాత్రం ఎన్టీఆర్ కి చేసింది ఏమీ లేదు. ఇక అదే క్రమంలో ఎన్టీఆర్ రాగ్ స్టెప్ వేశాడు అన్న టాక్ సైతం బలంగా వినిపిస్తుంది.