నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) పద్దతులను, సాంప్రదాయాలను, సెంటిమెంట్లని పక్కాగా పాటించే వ్యక్తి. చాలా విషయాల్లో తన తండ్రి నందమూరి తారకరామారావుని అనుసరించడానికి ఇష్టపడతారు. సీనియర్ ఎన్టీఆర్ కి ఉన్న గొప్ప క్వాలిటీస్లో.. ఆయన హీరోయిన్లకు రెస్పెక్ట్ ఇచ్చే విషయం ఒకటి. ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లను ఎన్టీఆర్ చాలా గౌరవించేవారట. తెరపై ఎంతటి లవర్ బాయ్‌లా కనిపించినా, లిప్ లాక్ , ఇంటిమేట్ సన్నివేశాలకు ఆయన చాలా దూరంగానే ఉండేవారు.
బాలకృష్ణ కూడా తండ్రి బాటలోనే నడుస్తూ హీరోయిన్లకి రెస్పెక్ట్ ఇస్తుంటారు. ట్రెండ్ కి తగ్గట్టు సినిమాల్లో రొమాన్స్ పెరిగినా, కథలో భాగంగా ఇంటిమేట్ సీన్స్ లో పాల్గొనాల్సి వచ్చినా బాలయ్య మాత్రం కొన్ని హద్దులు పెట్టుకునేవారట.
ముఖ్యంగా ఆన్ స్క్రీన్ లిప్-లాక్ సన్నివేశాలకి చాలా దూరంగా ఉండేవారట బాలయ్య. బాలకృష్ణ 51 ఏళ్ళ సినీ కెరీర్లో లిప్-లాక్ సన్నివేశాల్లో పాల్గొంది రెండే రెండు సందర్భాల్లో అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం.స్క్రిప్ట్ డిమాండ్ చేయడంతో 2 సినిమాల్లో బాలయ్య ఇద్దరు హీరోయిన్లకి లిప్ లాక్ చేయాల్సి వచ్చింది. వాటిని కూడా పద్దతిగానే హ్యాండిల్ చేశారు ఆ సినిమాల దర్శకులు. సరే ఇంతకీ బాలయ్య లిప్-లాక్ చేసిన ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?
ఒకరు రజిని.1987వ సంవత్సరంలో వై. నాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ‘రాము’ సినిమాలో ఓ రెయిన్ సాంగ్ ఉంటుంది. అందులో భాగంగా హీరోయిన్ రజనితో లిప్ లాక్ చేశారు బాలయ్య. బాలకృష్ణ కెరీర్‌లోనే ఇది మొదటి ఆన్-స్క్రీన్ లిప్ లాక్. అయితే ఆ సినిమా రిలీజ్ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ ఆ లిప్-లాక్ విజువల్ ని డిలీట్ చేయించారట.ఇక అటు తర్వాత అంటే దాదాపు 25 ఏళ్ల తర్వాత.. 2012లో ‘శ్రీమన్నారాయణ’ అనే సినిమా వచ్చింది.
ఇందులో భాగంగా ఓ సాంగ్లో హీరోయిన్ ఈషా చావ్లాని లిప్ లాక్ చేయాల్సి వచ్చింది. అప్పట్లో ఈ సినిమా హాట్ టాపిక్ అవ్వడానికి అదొక కారణమని చెప్పాలి.