Vijay Sethupathi: విజయ్ సేతుపతి నిజంగా మహారాజే.. ఇలాంటి హీరోలు ఎవరూ ఉండరుగా!

  • August 1, 2024 / 11:41 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ సేతుపతికి (Vijay Sethupathi) ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. సౌత్ ఇండియాలో విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ సత్తా చాటుతున్న నటులలో విజయ్ సేతుపతి ముందువరసలో ఉన్నారు. మహారాజ సినిమాతో విజయ్ సేతుపతి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరగా ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. పెద్దగా అంచనాలు లేకుండా మహారాజ థియేటర్లలో విడుదలై సంచలనాలు సృష్టించింది.

ఈ సినిమా దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ పై సైతం ఈ సినిమాతో ఊహించని స్థాయిలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అయితే విజయ్ సేతుపతి ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా మహారాజ సినిమాలో నటించారట. కథ నచ్చితే ఫ్రీగా కూడా నటించడానికి సిద్ధమని చాలామంది నటీనటులు చెబుతుంటారు. అయితే విజయ్ సేతుపతి మాత్రం గతంలో ఇలా చెప్పిన మాటను నిలబెట్టుకుని నిజంగానే ఈ సినిమాలో ఉచితంగా నటించారు.

అయితే లాభాల్లో వాటా తీసుకోవడానికి మాత్రం విజయ్ సేతుపతి అంగీకరించారని ఈ సినిమాకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వచ్చాయని తెలుస్తోంది. ఈ సినిమా విజయ్ సేతుపతికి 50వ సినిమా కావడం కొసమెరుపు. మహారాజ సినిమాకు స్క్రీన్ ప్లే ప్రధానంగా హైలెట్ గా నిలిచింది. మొదట ఈ సినిమా ప్రేక్షకులను నవ్విస్తూ మొదలై ఆ తర్వాత ఊహించని ట్విస్టులలో కళ్లు చెమ్మగిల్లేలా చేస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకుల ఊహలకు సైతం అందని విధంగా ఉండటం గమనార్హం.

విజయ్ సేతుపతి రియల్ లైఫ్ లో కూడా మహారాజే అని ఫ్యాన్స్ చెబుతున్నారు. కథను నమ్మి ఫ్రీగా సినిమాలలో నటించే హీరోలు ఈ కాలంలో ఎంతమంది ఉంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి. విజయ్ సేతుపతి కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విభిన్నమైన పాత్రలు నటుడిగా విజయ్ సేతుపతిని మరింత ఎత్తుకు ఎదిగేలా చేస్తున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus