Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

దిల్ రాజు(Dil Raju) ‘కె.జి.ఎఫ్’ ఫేమ్ యష్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను రూ.120 కోట్ల భారీ రేటుకి కొనుగోలు చేశారట.ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు దిల్ రాజు ఉన్న పరిస్థితికి ఇది చాలా పెద్ద రిస్క్ అని చెప్పాలి. అడ్వాన్స్ ప్రాతిపదికన ‘టాక్సిక్’ హక్కులు తీసుకున్నారట. అల్మోస్ట్ అంతా కూడా రిఫండబుల్  అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అయినప్పటికీ దిల్ రాజు పెద్ద రిస్క్ చేస్తున్నట్టే.

Dil Raju

ఎంధుకంటే ఇతర భాషల్లో రూపొందిన సినిమా ధియేట్రికల్ హక్కులను ఇంత మొత్తం పెట్టి కొనుగోలు చేయడం అంటే మాటలు కాదు. గతేడాది దిల్ రాజు తీసుకున్న ‘ఎల్ 2 : ఎంపురాన్’ ని కూడా ఇలాగే ఎక్కువ రేటుకి కొనుగోలు చేశారు. ఆ సినిమా దిల్ రాజుకి నష్టాలే మిగిల్చింది. అయినా ఆయన ‘టాక్సిక్’ విషయంలో రిస్క్ చేసేందుకు రెడీ అవ్వడం గమనార్హం.

సంక్రాంతికి రిలీజ్ అయిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ‘అనగనగా ఒక రాజు’ ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలను నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేశారు. అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యి.. ఆయనకు లాభాలు తెచ్చిపెట్టాయి. మరోపక్క ‘కె.జి.ఎఫ్ 2’ తర్వాత యష్ నటిస్తున్న సినిమా కావడంతో ‘టాక్సిక్’ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇటీవల యష్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన గ్లింప్స్ కూడా హాట్ టాపిక్ అయ్యింది.

సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా… భారీ లాభాలు వస్తాయి. దిల్ రాజు ధైర్యం, నమ్మకం అవే కావొచ్చు.గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ‘టాక్సిక్’ మార్చి నెలలో రిలీజ్ కానుంది అని ప్రకటించారు.

‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus