Dil Raju: దిల్ రాజుని ఇబ్బంది పెడుతున్నాడా..?

  • April 21, 2021 / 08:23 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కెరీర్ లో చాలా సినిమాలు దిల్ రాజు బ్యానర్ లో చేశారు. బన్నీతో ‘ఆర్య’ లాంటి హిట్ సినిమా తీసి అతడి కెరీర్ ను గాడిలో పడేలా చేశాడు దిల్ రాజు. ఆ తరువాత బన్నీతో ‘పరుగు’, ‘దువ్వాడ జగన్నాథం’ లాంటి సినిమాలను రూపొందించాడు దిల్ రాజు. వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దిల్ రాజుపై నమ్మకంతో అతడి బ్యానర్ లో మరో సినిమా చేస్తానని మాటిచ్చాడు అల్లు అర్జున్.

కానీ ఇప్పుడు ఈ సినిమా విషయంలో నిర్ణయం తీసుకోకుండా దిల్ రాజుని ఇబ్బంది పెడుతున్నాడట స్టైలిష్ స్టార్. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ‘ఐకాన్’ అనే సినిమా చేయడానికి అంగీకరించాడు బన్నీ. ముందు సినిమా చేయడానికి ఒప్పుకొని.. ఇప్పుడేమో ఇంతకీ సినిమా కోసం డేట్లు ఇవ్వకపోవడం.. ఏ విషయం తేల్చకపోవడం దిల్ రాజుకి నచ్చడం లేదట. ఈ విషయంలో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు ‘ఐకాన్’ టాపిక్ తీసుకొచ్చినా.. బన్నీ.. చూద్దాం, చేద్దాం అంటున్నాడే తప్ప ఏదీ కచ్చితంగా చెప్పడం లేదట.

రీసెంట్ గా దిల్ రాజు తన తదుపరి సినిమా ‘ఐకాన్’ అని మీడియా ముఖంగా వెల్లడించాడు. అప్పుడు కూడా బన్నీ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదట. తనకు సినిమా కథతో ఏమైనా సమస్య ఉన్నా.. లేక డేట్స్ ఇవ్వడం కుదరకపోయినా.. ఆ విషయాలు నేరుగా చెప్పాలి కానీ ఇలా వెయిట్ చేయించడం ఏంటనేది దిల్ రాజు ప్రశ్న. బన్నీ ఇలానే చేస్తే గనుక.. మరో హీరోతో ‘ఐకాన్’ సినిమా చేయాలని దిల్ రాజు నిర్ణయించుకున్నాడట. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి!

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus