Rajamouli: ఆ డైరెక్టర్ల స్టైల్ ను జక్కన్న ఫాలో అవుతారా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ఇండస్ట్రీలో గట్టి పోటీ పెరుగుతోందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు దర్శకుల నుంచి రాజమౌళికి గట్టి పోటీ ఎదురు కాగా బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ కూడా జక్కన్నకు పోటీ ఇస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. టాలీవుడ్ వరకు రాజమౌళి పై చేయి సాధిస్తుండగా ఇతర భాషల విషయానికి వస్తే ఒక్కో భాషలో ఒక్కో డైరెక్టర్ సక్సెస్ సాధిస్తున్నారు. రాజామౌళికి స్పెషల్ స్టైల్ ఉండగా ఒక్కో డైరెక్టర్ ఒక్కో స్టైల్ ను ఫాలో అవుతున్నారు.

అయితే రాజమౌళి కూడా ఆ డైరెక్టర్ల స్టైల్ ను తన సినిమాలలో మిక్స్ చేస్తూ సినిమాలు తీస్తారా? లేక సొంత స్టైల్ ను ఫాలో అవుతారా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. రాజమౌళి తర్వాత ప్రాజెక్ట్ మహేష్ హీరోగా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయని తెలుస్తోంది. రాజమౌళి ప్రస్తుతం ఇతర భాషల ప్రేక్షకులకు కూడా నచ్చేలా తన సినిమాలు ఉండాలని భావిస్తున్నారు. జక్కన్న కొత్త టెక్నాలజీలను సైతం అందిపుచ్చుకుంటూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.

సాధారణంగా 2.30 గంటల కంటే ఎక్కువ నిడివి ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఇష్టపడరు. అయితే రాజమౌళి సినిమాలు మాత్రం నిడివితో సంబంధం లేకుండా సక్సెస్ సాధిస్తున్నాయి. జక్కన్న పారితోషికం అంతకంతకూ పెరుగుతుండగా ఈ దర్శకుని క్రేజ్ కూడా అంచనాలకు మించి ఉంది. రాజమౌళి మహేష్ సినిమాకు సంబంధించి ఎలాంటి విషయాలను వెల్లడించకపోయినా ఈ మూవీలో నటించే నటీనటులు వీళ్లేనంటూ కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి.

రాజమౌళి ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసే సినిమాను తెరకెక్కించాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళి కథనం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతుండగా ఈ సినిమాలో నటించే నటీనటులకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus