ఇప్పుడు టాలీవుడ్లో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి (Anil Ravipudi), బాబీ కొల్లి (Bobby Kolli).. ఇద్దరూ టాప్ ప్లేస్లో ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అనిల్ రావిపూడి ఖాతాలో ఒక్క ప్లాప్ కూడా లేదు. బాబీ ట్రాక్ రికార్డుని గమనిస్తే.. పవన్ కళ్యాణ్ తో చేసిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ని మినహాయిస్తే.. మిగతావన్నీ హిట్లే..! వీళ్ళ సినిమాలు మినిమమ్ గ్యారెంటీ అని ఇండస్ట్రీ భావిస్తుంటుంది. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లకు వీళ్ళ సినిమాలపై నమ్మకం ఎక్కువ. పాన్ ఇండియా మూసలో పడిపోకుండా.. తమ స్ట్రెంత్ ను నమ్ముకుని రీజనల్ సినిమాలతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నారు ఈ టాప్ డైరెక్టర్లు. అయితే ఈ దర్శకుల మధ్య కూడా పోటీ వాతావరణం నెలకొంది.
గతంలో వీరిద్దరి సినిమాలు ఒకే టైంలో వచ్చాయి. 2025 సంక్రాంతికి వీరిద్దరి సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగాయి. బాలకృష్ణతో చేసిన ‘డాకు మహారాజ్’ తో బాబీ (Bobby Kolli) సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో పోటీకి దిగాడు. మరోవైపు అనిల్ రావిపూడి (Anil Ravipudi).. వెంకటేష్ తో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో బాక్సాఫీస్ బరిలో దిగాడు. రెండు సినిమాలకి ఆడియన్స్ నుండీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ వసూళ్లు రాబట్టి.. ‘డాకు మహారాజ్’ ను పక్కకు నెట్టింది. అలా బాబీపై అనిల్ రావిపూడి పైచేయి సాధించాడు. అయితే ఈ 2027 సంక్రాంతికి మళ్ళీ ఈ యంగ్ డైరెక్టర్స్ మధ్య గట్టి పోటీ ఏర్పడనుంది.
చిరంజీవితో చేసిన ‘కాకా’ తో బాబీ (Bobby Kolli) జనవరి 13న బాక్సాఫీస్ బరిలో నిలబడనున్నాడు. ‘వాల్తేరు వీరయ్య’ కాంబో కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు వెంకటేష్- కళ్యాణ్ రామ్..లతో చేస్తున్న ‘జనవరి 12 విడుదల’ తో అనిల్ రావిపూడి (Anil Ravipudi) సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా.. మెయిన్ ఫైట్ మాత్రం ఈ 2 సినిమాల మధ్యే ఉంటుంది. మరి 2027 సంక్రాంతికి అనిల్ రావిపూడి విన్నర్ గా నిలుస్తాడా? లేక బాబీ విన్నర్ గా నిలుస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.