Karthika Deepam: కార్తీక దీపం 2పై డైరెక్టర్ కామెంట్!

  • July 17, 2021 / 07:06 AM IST

ఒక సినిమా సక్సెస్ అయినా ప్లాప్ అయినా కూడా కొద్దీ రోజుల్లోనే జనాలు మర్చిపోతారు. కానీ సీరియల్స్ ను రిజల్ట్ తో డీల్ చేయడం చాలా కష్టమైన పని. రేటింగ్ రాకపోతే ఉన్న కథతోనే డోస్ పెంచాలి. ఇక రేటింగ్ హై లెవెల్లో ఉంటే అంచనాలను అందుకునేలా కథలో మరింత మ్యాటర్ ను మిక్స్ చేయాలి. ఇక కార్తీక దీపం దర్శకుడు కాపుగంటి రాజేంద్ర ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సిరియల్ సీక్వెల్ పై క్లారిటి ఇచ్చాడు.

వెయ్యికి పైగా ఎపిసోడ్స్ ను ఫినిష్ చేసుకున్న కార్తీక దీపం గత కొంతకాలంగా టాప్ రేటింగ్స్ ను అందుకుంటోంది. ఏ సీరియల్ కూడా పోటీకి రావడం లేదు. టీవీల్లో కొత్త సినిమాలకంటే హై రేంజ్ లో కార్తీక దీపం రేటింగ్స్ అందుకుంటోంది. ఇక ఈ సిరియల్ కు త్వరలోనే ఎండ్ కార్డ్ పడబోతున్నట్లు టాక్ వచ్చింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఇటీవల ఆ సీరియల్ దర్శకుడు ఇచ్చిన వివరణతో అర్ధమయ్యింది.

ఏదైనా సరే బిజినెస్ పరంగానే ఉంటుంది. ప్రస్తుతం కార్తీక దీపం సీక్వెల్ పై అయితే పెద్దగా ఆలోచించలేదు గాని సిరియల్ మాత్రం టాప్ రేటింగ్స్ అందుకుంటున్న క్రమంలో ఇలా కొనసాగుతూనే ఉంటుంది. బోర్ కట్టినప్పుడు ఎదో ఒక ట్విస్టుతో ఇంట్రెస్టింగ్ గా మలచడమే.. అంటూ రాజేంద్ర ఓపెన్ గా వివరణ ఇచ్చారు. మొత్తానికి వంటలక్క, కార్తీక బాబు ఇప్పట్లో కలిసేలా లేరని ఆ కథ మరికొన్నాళ్లు ఇలానే కొనసాగుతుందని క్లారిటీ వచ్చేసింది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus