బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ “కల్కి” (Kalki 2898 AD) సినిమాలోని ప్రభాస్ (Prabhas) లుక్స్ & క్యారెక్టరైజేషన్ ను ఉద్దేశించి “జోకర్” అని ప్రస్తావించిన విజయం తెలిసిందే. ఈ విషయమై గత వారం రోజులుగా సోషల్ మీడియా సాక్షిగా నార్త్ & సౌత్ ఆడియన్స్ దారుణంగా తిట్టుకొంటున్నారు. మధ్యలో నాని (Nani) అర్షద్ వార్సీ (Arshad Warsi) కామెంట్ పై స్పందిస్తూ “బహుశా ఆ ఆర్టిస్ట్ కు ఈ కామెంట్ చేసిన తర్వాతే ఎక్కువ పబ్లిసిటీ వచ్చిందేమో” అని చేసిన కామెంట్ ఇంకా వైరల్ అయ్యింది.
దాంతో నార్త్ ఆడియన్స్ నానిని మరియు నాని కొత్త సినిమా “సరిపోదా శనివారం”(Saripodhaa Sanivaaram) గురించి నెగిటివ్ కామెంట్ చేయడం మొదలెట్టారు. దాంతో ఇది పెద్ద రచ్చకు దారి తీసింది. ఇప్పుడు ఈ విషయాన్ని సెటిల్ చేయడం కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) రంగంలోకి దిగాడు. “అర్షద్ వార్సీ తన పదాలను సరిగ్గా ఎంచుకోవాల్సింది” అని సర్దిచెబుతూనే.. ఆయన పిల్లలకు బుజ్జి బొమ్మలు పంపిస్తానని చమత్కరించాడు.
అదే ట్వీట్లో నార్త్ & సౌత్ అంటూ విబేధాలు సృష్టించకూడదు అని, ఇండియన్ ఫిలిం ఇండస్టీగా ముందుకు సాగాలని కోరాడు. ఈ విషయాన్ని మరికాస్త పెద్దది చేయాలని మరో ట్విట్టర్ ఎకౌంట్ ప్రయత్నించగా.. ఎందుకు బ్రదర్ అంత నెగివిటివీ, నీకు కూడా బుజ్జి బొమ్మలు పంపనా అంటూ నాగి వేసిన ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిజానిక నాగి అన్న విషయంలో తప్పేమీ లేదు. నాని కూడా ముంబై ప్రమోషన్స్ లో భాగంగా అర్షద్ వార్సీ కామెంట్స్ పై స్పందిస్తూ.. “నిజానికి పూర్తిగా వీడియో చూస్తే ఆయన కామెంట్స్ లో నెగిటివిటీ అనేది లేదు, ఆ పార్ట్ ను అలా కట్ చేయడం వల్ల ఇంత రచ్చ జరిగింది” అని వివరణ ఇచ్చాడు. మరి ఇప్పటికైనా ఈ రచ్చకు తెరపడుతుందో లేదో చూడాలి.