నాగ్ అశ్విన్ (Nag Ashwin).. పై తెలుగు ప్రేక్షకులందరిలో ఓ పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ‘కల్కి..'(Kalki 2898 AD) .తర్వాత అతనిపై ఆ నమ్మకం ఇంకా ఎక్కువయ్యింది. ‘ఎటువంటి నెగిటివిటీ జోలికి పోకుండా తన సినిమాలు ఏవో తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు నాగ్ అశ్విన్’ అని అంతా అనుకుంటున్న టైంలో ఓ బాంబు పేల్చాడు ఈ యంగ్ డైరెక్టర్. తాజాగా అతను ‘కల్కి..’ 1000 కోట్ల వసూళ్లను సాధించిన సందర్భంగా ఓ పోస్ట్ పెట్టాడు. అది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
నాగ్ అశ్విన్ తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ…”ఈ మైల్స్టోన్.. ఈ నంబర్లు.. మా యువ టీమ్కు చాలా ఇంపార్టెంట్. మాకు ఇవి ఎంత బలాన్ని ఇచ్చాయో మాటల్లో చెప్పలేం. ఇక్కడ మేము చెప్పిన వాస్తవం ఏంటంటే.. మేము ఇలాంటి అద్భుతమైన విజయాన్ని ఎటువంటి హింస, అశ్లీలత,రక్తపాతం, జనాల్ని తప్పుదోవ పట్టించే కంటెంట్ లేకుండా సాధించాం. మా ఈ ప్రయత్నాన్ని ఆదరించినందుకు ప్రేక్షకులకి, నటులకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది ఇండియన్ సినిమా అంటే” అంటూ రాసుకొచ్చి.. చివర్లో ‘రేపటి కోసం” అనే హ్యాష్ ట్యాగ్ ని జతచేశాడు.
ఈ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ‘హింస, అశ్లీలత,రక్తపాతం, జనాల్ని తప్పుదోవ పట్టించే’ కంటెంట్ అనగానే ప్రేక్షకులకి రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) , సందీప్ రెడ్డి వంగా గుర్తుకొస్తారు. రాంగోపాల్ వర్మ అలాంటి కంటెంట్ తో సినిమాలు చేసినా అవి ఆడట్లేదు.కాబట్టి పరోక్షంగా ఈ కామెంట్లు అన్నీ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ‘యానిమల్’ (Animal) ని టార్గెట్ చేసే నాగ్ అశ్విన్ చేసి ఉండొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ తో (Prabhas) సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ (Spirit) చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ డిఫెండ్ చేసుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.