యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు (Jr NTR) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 2025 జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ సినిమా 350 కోట్ల రూపాయల నుంచి 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుందని అభిమానులు భావిస్తుండగా ప్రశాంత్ నీల్ మాత్రం ఒక భాగంగానే తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ప్రశాంత్ నీల్ ఇచ్చిన ట్విస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు ఒకింత భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండటం గమనార్హం.
జూనియర్ ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ లు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం బరువు పెరగనున్నారని సమాచారం అందుతోంది. తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. 2026 సంవత్సరం జనవరి నెల 9వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
బంగ్లాదేశ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. అయితే ప్రశాంత్ నీల్ సినిమాలకు సంబంధించి అధికారికంగా అప్ డేట్స్ ఇస్తే తప్ప వైరల్ అవుతున్న వార్తలను నమ్మలేము. తారక్ ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగే విధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రణాళికలు ఉన్నాయి.