Poonam Kaur: పూనమ్ కౌర్ మరో సంచలన ట్వీట్.. కడుపు చేసింది అతనే అంటూ..!

పూనమ్ కౌర్ (Poonam Kaur) – త్రివిక్రమ్ (Trivikram) – పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ..ల వ్యవహారం గురించి పూర్తిగా ఎవ్వరికీ తెలీదు. అయితే ‘అతడు’ లో  (Athadu) ఎం.ఎస్.నారాయణ (M.S Narayana) అన్నట్టు ‘చూపించి చూపించకుండా…చెప్పి చెప్పకుండా’ అన్నట్టు ట్విట్టర్లోకి వచ్చి ఏవేవో ట్వీట్లు వేస్తుంటుంది పూనమ్ కౌర్. కొన్నాళ్ల వరకు పరోక్షంగా మాత్రమే త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్..లను కెలికేది. గతంలో సిద్దార్థ్ (Siddharth) ఓ స్టార్ హీరోయిన్ విడాకుల వ్యవహారంపై పరోక్షంగా సెటైర్ వేస్తే.. అందుకు పూనమ్ కూడా పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై సెటైర్ వేసింది.

Poonam Kaur

ఇక ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) సినిమా టైంలో కూడా ఆమె ఓ వ్యక్తితో చాట్ చేసిన స్క్రీన్ షాట్ షేర్ చేసింది. అందులో ‘బావ హిట్టు కొట్టాడు అక్కా’ అంటూ ఆ వ్యక్తి పూనమ్ తో చెబుతున్నట్టు రాసి ఉంది. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ప్రచారం చేస్తున్న టైంలో కూడా పరోక్షంగా ఆమె నెగిటివ్ కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే కొద్దిరోజులుగా ఆమె పవన్ ను పక్కన పెట్టి త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది.

జానీ మాస్టర్ (Jani Master) అరెస్ట్..కి ముందు త్రివిక్రమ్ గురించి ‘మా’ కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోలేదని ఆమె ట్వీట్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక లేటెస్ట్ గా ఆమె మరో ట్వీట్ చేసి.. ఇంకో సంచలనానికి నాంది పలికింది. ‘నాకు కడుపు చేసింది.. కెరీర్ ను నాశనం చేసింది.. స్టార్ హీరో కమ్ పొలిటీషియన్ కాదు. అతను ఓ దర్శకుడు. కొంతమంది రాజకీయాల నాయకులు వాళ్ళ స్వార్ధానికి మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మాటలు పడేలా చేస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది.

అయితే ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా నెగిటివ్ కామెంట్స్ చేసిన పూనమ్.. ఇప్పుడు త్రివిక్రమ్ పై దృష్టి మళ్లించడానికి కారణం ఏంటి? బహుశా.. ‘పవన్ ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి.. బీజేపీతో పొత్తు వల్ల నార్త్..లో కూడా అతనికి ఫాలోయింగ్ పెరిగింది కాబట్టి.. భయపడి ప్లేటు మార్చిందా?’ అనేది తెలియాల్సి ఉంది.

‘దేవర’ 12 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus