దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాచురల్ స్టార్ నాని అభిమానులకు హీరో పుట్టినరోజు ముందుగానే పండగ వాతావరణాన్ని తీసుకురాబోతున్నాడు . టాలీవుడ్ లో మాస్‌కు సరికొత్త నిర్వచనం ఇచ్చిన మూవీ ‘దసరా’ తర్వాత, నాని మరోసారి దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి పనిచేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది పారడైజ్’ . దీంతో ఈ సినిమాపై మొదటి నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇప్పుడు ఆ అంచనాలకు మరింత ఊపు తెచ్చేలా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా, ఈ సినిమా నుంచి ‘ఆయాషేర్ (Aaya Sher)’ పేరుతో ఒక ప్రత్యేక విజువల్ ట్రీట్‌ను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ అప్డేట్‌తోనే సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది. శ్రీకాంత్ ఓదెల స్టైల్‌లో రా అండ్ రస్టిక్ యాక్షన్, లోతైన భావోద్వేగాలు ఈ సినిమాలో మరింత ఆసక్తికరంగా ఉండబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది.
ఇక విడుదల విషయానికి వస్తే, ఆగస్టు 21, 2026న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. నాని కెరీర్‌లోనే అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను కేవలం తెలుగులోనే కాకుండా, మొత్తం 8 భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి మరింత క్రేజ్ తీసుకువచ్చే విషయం ఏంటంటే, మ్యూజిక్ సంచలనం అనిరుద్ రవిచందర్ అందిస్తున్న మ్యూజిక్ ఇప్పటికే అభిమానుల్లో అంచనాలను ఆకాశానికి ఎత్తేసింది. నాని ఎనర్జీకి అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జతకలిస్తే బాక్స్ ఆఫీస్ బద్దలవడం ఖాయమనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది.
ఫిబ్రవరి 24న విడుదలయ్యే ‘ఆయాషేర్’ వీడియోతో ఈ సినిమా క్రేజ్ మరో స్థాయికి చేరడం ఖాయం. నాని అభిమానులకు ఇది నిజంగా బర్త్‌డే బ్లాస్ట్ అనే చెప్పాలి.