Rana: ‘జై హనుమాన్’ లో రానా?

2024 సంక్రాంతికి ఓ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యింది ‘హనుమాన్’ సినిమా. కానీ పోటీలో నిలబడ్డ అన్ని సినిమాలకంటే ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది. ఏకంగా మహేష్ బాబు- త్రివిక్రమ్..ల ‘గుంటూరు కారం’ సినిమాని ఓవర్ టేక్ చేసి మరీ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

Rana

తేజ సజ్జ ‘హనుమాన్’ లో హీరోగా నటించాడు. ప్రశాంత్ వర్మ దర్శకుడు. అయితే ‘హనుమాన్’ కి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ కూడా ఉంటుందని ‘హనుమాన్’ ఎండ్ టైటిల్స్ లో రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

 2025 సంక్రాంతికే ఆ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. కానీ అలా జరగలేదు. 2025 సంక్రాంతే కాదు, 2026 సంక్రాంతి కూడా వెళ్ళిపోయింది. కనీసం ‘జై హనుమాన్’ షూటింగ్ కూడా మొదలుకాలేదు.అయితే అతి త్వరలో హంపిలో ‘జై హనుమాన్’ ని పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయాలని చిత్ర బృందం భావిస్తుంది. ఈ సినిమాలో హనుమంతుల వారిగా ‘కాంతార’ ఫేమ్ రక్షిత్ శెట్టి నటిస్తున్నాడు.

తేజ సజ్జ ఈ సినిమాలో నటించడం లేదు అనే టాక్ నడుస్తుంది. మరోవైపు ఈ సినిమాలో రానా దగ్గుబాటి(Rana) కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఇటీవల రానా పాత్రకి సంబంధించి లుక్ టెస్ట్ కూడా నిర్వహించారట. యంగ్ గెటప్ లో అలాగే ఓల్డ్ గెటప్లో కూడా రానాకి లుక్ టెస్ట్ జరిగినట్టు తెలుస్తుంది. సో దీనిని బట్టి.. ‘జై హనుమాన్’ లో రానా అత్యంత కీలక పాత్రకి ఎంపికైనట్టు అర్ధం చేసుకోవచ్చు.

చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus