Tollywood Directors: కమ్‌ బ్యాక్‌ ప్లీజ్‌ కెప్టెన్స్‌… హిట్‌ కోసం వీరు రెడీ.. ఛాన్స్‌ కోసం వారు రెడీ..

సినిమా పరిశ్రమలో హిట్‌, ఫ్లాప్‌ సహజం. అయితే ఇది అందరికీ వర్తించదు. ఓ ఫ్లాప్‌ సినిమా హీరో మీద చూపించే ఎఫెక్ట్‌.. దర్శకుడి మీద చూపించే ప్రభావం చాలా ఎక్కువ. ఆ హీరో వెంటనే కోలుకొని ఇంకో సినిమా చేసేస్తారు. కానీ ఆ దర్శకుడు మరో సినిమా చేయడానికి చాలా టైమ్‌ పట్టేస్తుంది. అయితే అంత టైమ్‌ తీసుకొని వచ్చి.. మంచి సినిమా చేసి కమ్‌ బ్యాక్‌ ఇవ్వడం అందరి వల్లా కాదు. ఇప్పుడు ఫలితం సంగతి పక్కన పెడితే కమ్‌ బ్యాక్‌ కోసం రెడీ అవుతున్న కెప్టెన్స్‌.. కమ్‌ బ్యాక్‌ ఛాన్స్‌ కోసం వెయిట్‌ చేస్తున్న డైరక్టర్లు ఎవరో చూద్దామా.

Tollywood Directors

మాటల మాంత్రికుడు అని ఆయను ఒక రంగానికి పరిమితం చేసేశారు కానీ.. ఆయన ఓ జోనర్‌ మీద గట్టిగా దృష్టి పెడితే అందులో హైని చూపిస్తారయన. ఇప్పుడు క్రైమ్‌, ఫ్యామిలీ జోనర్లు కలిపి ‘ఆదర్శ కుటుంబం’ అంటూ వెంకటేశ్‌ని తీసుకొస్తున్నారు. హీరో పాత్ర చుట్టూనే కథను తిప్పి, నడిపి.. హిట్‌ కొట్టడంలో పూరి జగన్నాథ్‌ ఫ్యామస్‌. ఆయన సినిమా విజయంలో ఆయనకు వచ్చే పేరు చాలా ఎక్కువ. ఇప్పుడు ‘స్లమ్‌ డాగ్‌’తో విజయ్‌ సేతుపతితో కలసి అదే పనిలో ఉన్నారు.

ఇక పెద్ద సినిమాలు తీయడంలో, అందులోనూ వేగంగా తీయడంలో దిట్ట అయిన క్రిష్‌.. కొత్త వారితో ఓ సినిమా తీసి విడుదలకు రెడీ చేస్తున్నారు. కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో శ్రీను వైట్ల ఓ మార్క్‌ వేశారు. ఇప్పటికీ చాలామంది దర్శకులు ఆయనను ఫాలో అవుతారంటే అతిశయోక్తి కాదు. కానీ ఆనయకు కలసి రావడం లేదు. ‘జార్జి క్రిష్‌’గా సంక్రాంతికి శర్వానంద్‌ను తీసుకొస్తున్నారు.

ఇప్పటివరకు ప్రస్తుతం కమ్‌ బ్యాక్‌ సినిమాలు చేస్తున్న వారి గురించి చదివారు.. ఇప్పుడు కమ్‌ బ్యాక్‌ ప్రాజెక్ట్‌ కోసం ఎదురుచూస్తున్న వాళ్ల గురించి చూద్దాం. వారే హరీశ్‌ శంకర్‌, మారుతి, పరశురామ్‌, గౌతమ్‌ తిన్ననూరి, శ్రీకాంత్‌ అడ్డాల, సురేందర్‌ రెడ్డి. మిగిలిన వారు కూడా ఉన్నా వీరు మినిమమ్‌ గ్యారెంటీ దర్శకులు. సినిమా వస్తోంది అంటే ఓ అంచనాలు ఏర్పడతాయి.

శ్రీలీల ప్లేస్‌లోకి ఫ్లాప్‌ హీరోయిన్‌.. ఏ సినిమాలో ఎవరు వచ్చారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus