DNK Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘దొంగ నా కొడుకు’

’90’s’ వెబ్ సిరీస్, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మౌళి. ముఖ్యంగా ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి.. మార్కెట్ కూడా పొందాడు. దీంతో ఇండియన్ టాప్ బ్యానర్ అయినటువంటి ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ పిలిచి మరీ తమ బ్యానర్లో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చింది. అలా ‘డి ఎన్ కె'(DNK- Donga Na Kodaku) సినిమా రూపొందింది. టీజర్, ట్రైలర్స్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా నవంబర్ 13న రిలీజ్ కాబోతోంది.

DNK Collections

‘లిటిల్ హార్ట్స్’ బ్లాక్ బస్టర్ అవ్వడం, పైగా ‘మైత్రి మూవీ మేకర్స్’ వంటి బడా నిర్మాణ సంస్థ రిలీజ్ చేసిన సినిమా కావడంతో ‘డి ఎన్ కె’ పై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ మొదటి రోజు సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మంచి వసూళ్లనే  సాధిస్తుంది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

 నైజాం  0.85 cr
 సీడెడ్  0.17 cr
 ఆంధ్ర(టోటల్)  0.59 cr
 ఏపీ +తెలంగాణ(టోటల్)  1.61 cr (షేర్)
 రెస్ట్ ఆఫ్ ఇండియా  0.30 cr
 ఓవర్సీస్  0.58 cr
 వరల్డ్ వైడ్ టోటల్  2.49 cr (షేర్)

‘డి ఎన్ కె’ సినిమాకి రూ.7 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా రూ.2.49 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.4.22 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.5.01 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

మళ్లీ అల్లు అర్జున్‌ దగ్గరకు వెళ్తారా? లేక మొన్నటి ఫొటో నిజం చేస్తారా?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus