మెగా కోడలు ఉపాసన జూన్ 20వ తేదీ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఉపాసన పెళ్లైన 10 సంవత్సరాలకు తల్లి కావడంతో మెగా కుటుంబంలో సంతోషం వెల్లు విరిసింది. ఉపాసన అపోలో హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ అనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈమె డెలివరీ కూడా తన సొంత హాస్పిటల్ లోనే జరిగింది. ఈమె విదేశాలలో డెలివరీ అవుతారు అంటూ ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఉపాసన మాత్రం ఆ వార్తలన్నింటినీ కొట్టి పారేస్తూ తన డెలివరీ తన సొంత హాస్పిటల్ అపోలోనే జరుగుతుందని ఈమె తెలియజేశారు.
ఇకపోతే ఉపాసన తన సొంత హాస్పిటల్ లో డెలివరీ అయినప్పటికీ తన డెలివరీ కోసం భారీ స్థాయిలోనే ఖర్చు చేశారని హాస్పిటల్ బిల్ మొత్తం రామ్ చరణ్ పే చేశారని తెలుస్తుంది. మరి ఉపాసన డెలివరీ కోసం రాంచరణ్ ఎంత ఖర్చు పెట్టారు అనే విషయానికి వస్తే…ఉపాసన అపోలో హాస్పిటల్లో డెలివరీ అయినప్పటికీ ఫారిన్ నుంచి కొందరు డాక్టర్లను హైదరాబాద్ పిలిపించారట.
అదే విధంగా కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా విదేశాల నుంచే తెప్పించారని తెలుస్తోంది. వీటికోసం దాదాపు కోటిన్నర రూపాయల వరకు ఖర్చు చేశారని తెలుస్తుంది. ఈ ఖర్చు మొత్తం ఉపాసన తల్లిదండ్రులు భరిస్తామని చెప్పినప్పటికీ రామ్ చరణ్ తానే ఈ బిల్లు పే చేసారని తెలుస్తోంది.
ఉపాసన (Upasana) డెలివరీ కోసం రామ్ చరణ్ దాదాపు కోటిన్నర రూపాయల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. ఇలా 10 సంవత్సరాల తర్వాత మెగా వారసురాలు జన్మించడంతో బుల్లి మెగా వారసురాలని చూడటం కోసం అభిమానులు ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారు.
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!